‘జీఓ 279కి వ్యతిరేకంగా ఉద్యమం’
అనంతపురం అర్బన్ : మునిసిపల్ కార్మికుల పొట్టకొట్టేందుకు తీసుకొచ్చిన జీవో 279కి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. సోమవారం స్థానిక జన విజ్ఞాన వేదిక కార్యాలయంలో జీవో 279పై కార్మిక సంఘాల నాయకులు విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి కార్మిక వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కార్మికులను, ఉద్యోగులను తొలగిస్తూ జీవోలు విడుదల చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు.
సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్, వైఎస్‌ఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కేవీ రమణ, ఏఐటీయూసీ కార్యనిర్వాహక కార్యదర్శి శకుంతలమ్మ, ఐఎఫ్‌టీయూ ఉపేంద్ర, ఏఐయూటీయూసీ సుబ్రమణ్యం, మునిసిపల్ సంఘం నాయకులు గోపాల్, నరసింహులు, నల్లప్ప, పెన్నొబుళేసు, నాగభూషణం, పాల్గొన్నారు.