తాడేపల్లి రూరల్: సీతానగరం పీడబ్ల్యూడీ వర్క్‌షాపు ఎంప్లాయీస్ క్రెడిట్ సొసైటీలో కార్మికుల పేరుతో కొందరు నొక్కేసిన రుణాల మొత్తం రూ.3 కోట్లకుపైగానే ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ కుంభకోణానికి తోడల్లుళ్లు ఇద్దరు సూత్రధారులని చెప్పుకుంటున్నారు. సొసైటీ పాలకవర్గంలో ఎవరున్నా ‘హవా’ అంతా వీరిదేనని, ఏడెనిమిదేళ్లుగా ఈ కుంభకోణానికి పాల్పడుతున్నారని కార్మికులు చెబుతున్నారు. ఈ వ్యవహారం గురించి కొందరు వర్క్‌షాపు అధికారులు, సిబ్బందికి ముందే తెలిసినా ‘సూత్రధారు’లకు భయపడి నోరు మెదప లేదు.
‘ప్రసాదం’లా స్వాహా.. సొసైటీలో 2009 సంవత్సరం నుంచి చక్రం తిప్పుతున్న వ్యక్తి తోటి కార్మికులకు తెలిసి కొంత, తెలియకుండా మరికొంత మొత్తాన్ని ‘ప్రసాదం’లా స్వాహా చేస్తూ వచ్చారని కార్మికులు చెబుతున్నారు. వర్క్‌షాప్ ఎంప్లాయూస్ సొసైటీ 2009 ఏప్రిల్ 25 నుంచి 2011 ఆగస్టు 12 వరకు మూడు కోట్ల 67 లక్షల 32 వేల రూపాయలను మంగళగిరిలోని గుంటూరు జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు శాఖ నుంచి రుణ ంగా పొందినట్టు బ్యాంకు లెడ్జర్లు చెబుతున్నాయి. ఇందుకు ప్రతి నెలా అసలు కింద రూ.6,12,250, వడ్డీ కింద రూ. 3,91,000 మొత్తం రూ.10,03,250 సొసైటీ బ్యాంకుకు చెల్లించాల్సి ఉంది. కానీ.. కేవలం రూ.3,20,000 మాత్రమే కడుతోంది.
బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం.. ప్రతి నెలా దాదాపు రూ.7 లక్షలు జమ కాకుండా ఉన్నా మంగళగిరి బ్యాంకు శాఖ అధికారులు పట్టించుకోకపోవడం విశేషం. ఈ ఏడాది ప్రారంభానికి అసలు కింద 2,27,51,995 రూపాయలు, వడ్డీ కింద 8,57,035 రూపాయలు మొత్తం 2,36,09,030 వరకూ బకాయి పడ్డట్టు ఏప్రిల్‌లో బ్యాంకు జిల్లా అధికారులు గుర్తించారు. బకాయి వసూలు కాకపోవడానికి కారణం చెప్పాలంటూ బ్యాంక్ సీఈవో నోటీసులు ఇచ్చేవరకూ మంగళగిరి శాఖ అధికారులు పట్టించుకోలేదు. తర్వాత సైతం 2014 ఏప్రిల్ 23న వర్క్‌షాపు జనరల్ సూపరింటెండెంట్‌కు ఓ లేఖ రాసి వివరణ కోరారే తప్ప మూడు నెలలు గడిచినా సొమ్ము వసూలుకు పూనుకోలేదు.
అంతా నిబంధనలకు విరుద్ధంగా.. ఈ వ్యవహారంలో సొసైటీ, బ్యాంకు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు స్పష్టమవుతోంది. తోడ ల్లుళ్లిద్దరు నడిపిన ఈ దందాలో వర్క్‌షాప్ అధికారులు, బ్యాంక్ సిబ్బంది హస్తం కూడా ఉండ టం వల్లే ఇలా జరిగిందని కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ ప్రెసిడెంట్‌తోపాటు మరో వ్యక్తి పేరుమీద బ్యాం కు చెక్కులు ఇస్తుండడం వల్లే కుంభకోణం జరిగిందని తెలుస్తోంది.
అక్రమార్కులు కార్మికులకు తెలియకుండా వారి సంతకాలు ఫోర్జరీ చేసి సొమ్ము కాజేసినట్టు సమాచారం. ఇలా సుమారు 30 మందికిపైగానే నష్టపోయినట్టు తెలుస్తోంది. సొసైటీ పొందిన రుణాలను బ్యాంకుకు తిరిగి చెల్లించాల్సిన బాధ్యత వర్క్‌షాపు యూజమాన్యానిది. కార్మికుల జీతభత్యాల నుంచి ఈ మొత్తం రికవరీ చేసి వర్క్‌షాపు నేరుగా బ్యాంకు మేనేజర్ పేరిట చెక్కు ఇవ్వా లి. కానీ వర్క్‌షాపు అధికారులు బ్యాంకు మేనేజర్ పేరిట కాకుం డా సొసైటీ అధ్యక్షుని పేరుతో చెక్కులు, డీడీలు ఇవ్వడం విశేషం.
క్లియరెన్స్ సర్టిఫికెట్ల ముసుగులో.. అసలు వ్యక్తులకు తెలియకుండా దొంగ సంతకాలతో రుణాలు తీసుకోవడం ఒక ఎత్తై, క్లియరెన్స్ సర్టిఫికెట్ల ముసుగులో కార్మికులు చెల్లించిన సొమ్మును నొక్కేసిన ఘటనలు కూడా కొన్ని ఉన్నట్టు తేలింది. పదవీ విరమణ చేసిన కార్మికులు తమకు రావలసిన ప్రయోజనాల మొత్తా న్ని పొందటానికి సొసైటీ నుంచి నోఅబ్జెక్షన్ లేదా క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకుని సమర్పించాలి. ఒకవేళ బకాారుులు ఉంటే చెల్లిం చి సర్టిఫికెట్ పొందాలి. కొందరు కార్మికులు చెల్లించిన సొమ్ము ను సొసైటీ ఖాతాలో జమ చేయకుండా అక్రమార్కులు నొక్కేసి సర్టిఫికెట్లు జారీ చేసినట్టు తెలిసింది.
తాజాగా బ్యాంకు అధికారులు గుర్తించిన రుణ బకారుుదారుల జాబితాలో రిటైరయి, బెనిఫిట్స్ తీసుకున్నవారి పేర్లు ఉండడం గమనార్హం. దీం తో జామీనుగా ఉన్న కార్మికులపై వర్క్‌షాపు అధికారులు ఒత్తిడి తెస్తున్నారు.
నోరు విప్పని వర్క్‌షాపు అధికారులు.. దీనిపై వర్క్‌షాపు అధికారులను వివరణ అడుగగా వర్క్‌షాపు జనరల్ సూపరింటెండెంట్ సెలవుపై ఉన్నారని, ఆయనే వివరణ ఇవ్వాలి తప్ప తాము చెప్పలేమని అన్నారు. కనీసం జీఎస్ ఫోన్ నంబర్ ఇచ్చేందుకు కూడా నిరాకరించారు. ఆయన ఎప్పుడు వస్తారనేది కూడా తమకు తెలియదనడం విశేషం.
నోటీసులు జారీ చేశాం.. దీనిపై కోపరేటివ్ బ్యాంకు మంగళగిరి శాఖ మేనేజర్ రాధాకృష్ణ మాట్లాడుతూ పీడబ్ల్యూడీ వర్క్‌షాపు ఎంప్లాయీస్ క్రెడిట్ సొసైటీ నుంచి పూర్తిస్థాయి మొత్తం రాకపోవడంతో పరిశీలన జరపగా భారీగా అవకతవకలు జరి గినట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. సుమారు 78 మంది కార్మికులు పేర్లు గల్లంతయ్యాయని వెల్లడించారు. వాటి వివరాలు తెలిపాలని ఈ నెల 9న సొసైటీకి నోటీసులు జారీ చేశామని చెప్పారు. మరో రెండు రోజుల్లో సొసైటీ వివరణ ఇవ్వకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
లోన్ గోల్‌మాల్ రూ.3 కోట్లపైనే!
Published Tue, Jul 22 2014 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM
Advertisement
Advertisement