శ్రీరామనగరం(శంషాబాద్ రూరల్), న్యూస్‌లైన్: మండల పరిధిలోని ముచ్చింతల్ సమీపంలో శ్రీరాం నగర్‌లో ఉన్న ‘జిమ్స్’ ఆస్పత్రి ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శనివారం రెండో రోజు ప్రత్యేకంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
శంషాబాద్, మహేశ్వరం, కొత్తూరు మండలాల నుంచి సుమారు 5 వేల మంది విద్యార్థులు శిబిరానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా మైహోం గ్రూపు ఎండీ జూపల్లి జగపతిరావు వూట్లాడుతూ.. విద్యార్థుల్లో ఎక్కువ వుంది చర్మరోగాలు, కంటి, దంత సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారు. వీరికి చికిత్స నిర్వహించి వుందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. శిబిరాన్ని మైహోం గ్రూపు చైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావు సందర్శించారు.
ఆదివారం అందరికీ..
ఆదివారం శిబిరంలో అన్ని వయసుల వారికి వైద్య సేవలు అందజేస్తామని జగపతిరావు తెలిపారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల వాసులకు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఆయా ప్రాంతాలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు శిబిరం వద్ద భోజన సదుపాయం కల్పించినట్లు చెప్పారు.
‘జిమ్స్’ వైద్య శిబిరానికి విశేష స్పందన
Published Sun, Feb 16 2014 1:28 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement