సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి ఘటనపై గవర్నర్ నరసింహన్ ఆరా తీశారు. ఏపీ డీజీపీకి ఫోన్ చేసిన గవర్నర్ విపక్ష నేతపై జరిగిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై తనకు తక్షణమే నివేదిక పంపాలని డీజీపీని ఆదేశించారు.
విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో గురువారం మధ్యాహ్నం జగన్‌మోహన్‌రెడ్డిపై ఓ దుండగుడు దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్ జగన్‌పై నిందితుడు దాడికి తెగబడ్డాడు. కోడి పందేలకు ఉపయోగించే కత్తితో అతను జగన్‌పై దాడి చేశాడు. దీంతో వైఎస్ జగన్ భుజానికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్ శ్రీనివాస్‌గా గుర్తించారు. దాడి జరిగిన వెంటనే దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment