
వైభవంగా సూర్యపూజ మహోత్సవం
నాగలాపురం: చిత్తూరు జిల్లా నాగలాపురంలో వెలసిన వుత్స్యావతార వేదనారాయణస్వామి సూర్యపూజ వుహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు బుధవారం నిర్వహించిన ఈ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై సూర్యపూజ దర్శనం చేసుకున్నారు. సాయం సంధ్య వేళ సూర్యుని కిరణాలు గర్భాలయుం వరకు చేరిన అధ్భుత సన్నివేశాన్ని భక్తులు భక్తి ప్రపత్తులతో తిలకించారు. పరిచారిక పుణ్యజలాన్ని చిలకరిస్తుండగా భక్తజనులు రవి కిరణాలకు భక్తి ప్రపత్తులతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఘనంగా స్నపన తిరుమంజనం
నాగలాపురం వేదనారాయణస్వామి ఆలయంలో జరుగుతున్న సూర్యపూజ మహోత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఉదయం గోదాదేవి సమేత వేదనారాయణస్వామివారి ఉత్సవమూర్తులకు ఆలయ ప్రధాన అర్చకులు దొరైరాజ భట్టాచార్య, రాజాభట్టాచార్యులు స్నపన తిరుమంజన సేవను ఘనంగా నిర్వహించారు.
కోలాహలంగా తిరువీధి ఉత్సవం
వేదమంత్రోచ్ఛారణలు, కేరళవారుుద్యాలు, కోలాట భజన బృందాల నృత్యాలు, మంగళవారుుద్యాల సవ్వడి నడుమ గోదాదేవి సమేత వేదనారాయణస్వామి వారి తిరువీధి ఉత్సవం కోలాహలంగా సాగింది. సూర్యపూజ దర్శనానంతరం స్వర్ణకచిత ఆభరణాలు, సుగంధ పరిమళాలను వెదజల్లే పుష్పాలతో గోదాదేవి సమేత వేదనారాయుణస్వామిని అలంకరించి తిరుచ్చిపై ఆశీనులను చేసి తెప్పోత్సవానికి సిద్ధం చేశారు. విద్యుత్ కాంతుల వుధ్య స్వామి అవ్మువార్ల తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆలయంలో ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథా గానం, అన్నమయ్య ప్రాజెక్ట్ సౌజన్యంతో నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనల ఆలాపన భక్తులకు వీనుల విందు కలిగించారు. ఈ కార్యక్రమాలను సూపరెంటెండెంట్ చంద్రశేఖరరెడ్డి, ఆలయూధికారి లోకనాథరెడ్డి పర్యవేక్షించారు.