సాక్షి, నెల్లూరు : జిల్లాలో దివంగత ముఖ్యమం త్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతి వేడుకల ను మంగళవారం వాడవాడలా ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకా లు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అన్నదానాలు నిర్వహించారు. వికలాంగులకు వస్త్రాలు పంపిణీ చేశారు. నెల్లూరు నగరంలోని కరెంట్ ఆఫీస్ సెం టర్‌లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జి ల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేరిగ మురళీధర్ ఆ ధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ జ యంతి వేడుకలను నిర్వహించారు.
వైఎస్సార్ చి త్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పార్టీ నేతలు బండ్లమూడి అనిత, బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, పాండురంగారెడ్డి, చంద్రమౌళి పా ల్గొన్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ నాయకత్వంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ గాంధీబొమ్మసెంటర్‌లో వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి ముక్కాల పూ ల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్‌చేసి స్వీట్లు పంచారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కేక్ కట్‌చేసి స్థానికులకు పంచి పెట్టారు.
కార్యక్రమంలో విద్యార్థి నేతలు జయవర్ధన్, శ్రావణ్ పాల్గొన్నారు. కోవూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు జరి గాయి. ఆత్మకూరు, చేజర్ల మండలాల్లో పార్టీ నేత లు జయంతి వేడుకలు నిర్వహించారు. కావలిలో వైఎస్సార్ విగ్రహాలకు కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించి పూలమాలలతో నివాళులర్పించారు. కావలిలో వైఎస్సార్‌సీపీ నేతలు వికలాంగులకు దుస్తులు పంపిణీ చేశారు. గూడూరు టవర్ క్లాక్ వద్ద వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సర్వేపల్లిలో వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహిం చారు. సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీ వయ్య వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొన్నా రు. పార్టీ నేతలు దబ్బల రాజారెడ్డి, సత్యనారాయణరెడ్డి, బాలాచంద్రారెడ్డి పాల్గొన్నారు. తడలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వెంకటగిరిలో స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు అనాథాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అన్నదానం చేశారు. తొలుత వైఎస్సార్ విగ్రహాని కి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఉదయగిరి, దుత్తలూరుతో పాటు అన్ని మండలాల్లో వైఎ స్సార్ విగ్రహాలకు పాలాభిషేకం, పూలమాలల తో అభిమానులు నివాళులర్పించారు.
ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
Published Wed, Jul 9 2014 2:45 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement