చిన్న శేషుడిపై శ్రీరాముడి చిద్విలాసం | Grand celebrations of sri kodandaramaswami | Sakshi

చిన్న శేషుడిపై శ్రీరాముడి చిద్విలాసం

Mar 30 2014 4:30 AM | Updated on Sep 2 2017 5:20 AM

శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం చిన్నశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు.

తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్ : శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం చిన్నశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహనసేవ నిర్వహించారు. గజరాజులు ఠీవీగా ముందుకు కదిలాయి. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారి వాహనసేవ కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామిని దర్శించుకున్నారు. వాహన సేవ అనంతరం ఆలయంలోని కల్యాణ మండపంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చం దనం, పండ్ల రసాలతో స్వామి, అమ్మవార్లను అభిషేకించారు. సాయంత్రం 5 గంటలకు కోదండరాముడికి ఊంజల్‌సేవ నిర్వహించారు.

 హంస వాహనంపై
 స్వామివారి వైభవం
 శనివారం రాత్రి కోదండరాముడు హంస వాహనం అధిరోహించి పురవీ దుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. కళాకారుల భజనలు, రామనామ స్మరణల మధ్య స్వామి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవోలు హరీంద్రనాథ్, శ్రీధర్, ఏఈవో ప్రసాదమూర్తిరాజు పాల్గొన్నారు.

 ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
 శ్రీకోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహతి కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు అన్నమచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకుడు ఎంవీ.సింహాచలశాస్త్రి బృందం నిర్వహించిన భక్త శబరి హరికథా పారాయణం ప్రేక్షకులను అలరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement