వైభవం.. రంగనాథ కల్యాణం | grand celebrations of sridevi,boodevi | Sakshi
Sakshi News home page

వైభవం.. రంగనాథ కల్యాణం

Published Wed, Feb 19 2014 2:51 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

grand celebrations of sridevi,boodevi

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి కల్యాణోత్సవం పులివెందలలో అంగరంగ వైభవంగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన మంగళవారం ఇక్కడి పూల అంగళ్ల సర్కిల్‌లో అర్చకుడు కృష్ణరాజేష్ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామి వారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు+. సతీసమేతుడైన రంగనాథుని ముగమోహన రూపాన్ని చూసి భక్తులు తరించిపోయారు.
 
 భక్తాదులు స్వామివారి కల్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శాశ్వత కల్యాణ ఉభయకర్త అనంతపురం జిల్లా కల్యాణదుర్గానికి చెందిన చల్లా నారాయణస్వామి దంపతుల ఆధ్వర్యంలో కల్యాణోత్సవాన్ని జరిపించారు. అనంతరం రాత్రి సతీసమేతుడైన స్వామివారు గజ వాహనంపై పట్టణ పురవీధుల్లో ఊరేగి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. స్వామిని చూడగానే భక్తులు కాయకర్పూరాలు సమర్పించారు. పులివెందుల అస్లాం టెక్నో అకాడమీ డ్యాన్స్ మాస్టర్ అస్లాం ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.      
 - న్యూస్‌లైన్, పులివెందుల టౌన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement