జిల్లాలో పెరుగుతున్న స్వైన్ ఫ్లూ అనుమానిత కేసులు
ప్రత్యేక వార్డులో 8 మందికి చికిత్స
హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు
ఏలూరు (వన్ టౌన్) : స్వైన్ ఫ్లూ భయంతో జిల్లా వాసులు అల్లాడుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలతో ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య బుధవారం 8కి చేరింది. వీరికి స్వైన్ ఫ్లూ సోకింది, లేనిదీ ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. తాజాగా స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఏలూరు మండలం గుడివాకలంక గ్రామానికి చెందిన బలే మంగాయమ్మ బుధవారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది.
పరీక్షించిన వైద్యులు ఆమె గొంతు నుంచి శాంపిల్స్ సేకరించి, చికిత్స నిర్వహిస్తున్నారు. ఇదిలావుండగా, జిల్లాకు చెందిన మరో ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ఆ ముగ్గురికీ స్వైన్‌ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ఏలూరులో చికిత్స పొందుతున్న 8మంది పరిస్థితి బాగానే ఉందని, త్వరలోనే కోలుకుంటారని జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయాధికారి డాక్టర్ కె.శంకరరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ చెప్పారు.
స్వైన్ ఫ్లో
Published Thu, Feb 5 2015 2:54 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement