పలవునేరు, న్యూస్‌లైన్: కుప్పంకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖారా వం యాత్రకు వస్తే ఇళ్ల తలుపులు వేసుకోవుని టీడీపీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు చెబితే,అదే జనం వారి గుండె తలుపులు తెరుచుకుని జగన్‌మోహన్ రెడ్డికి ఆత్మీయు స్వాగతం పలికారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు పేర్కొన్నారు. సమైక్య శంఖారావం బహిరంగ సభ ఆదివా రం వుండల కేంద్రమైన వి.కోటలో జరిగింది.
ఈ కార్యక్రవూనికి పలవునేరు నియోజకవర్గవాసులే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి సైతం వేలాది వుంది తరలివచ్చారు. ఈసభలో జిల్లా స్థాయి నాయుకులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ప్రసంగించారు. రాజంపే ట పార్లమెంట్ ఇన్‌చార్జ్ మిధున్ రెడ్డి, తంబళ్లపల్లె వూజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కువూర్ రెడ్డి, లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ రెడ్డెప్ప, పూతలపట్టు సవున్వయుకర్త డాక్టర్ సునీల్, రాష్ట్ర యువజన కార్యవర్గ సభ్యుడు అరుణ్‌కువూర్ రెడ్డి, పూతలపట్టు నాయుకులు కేశవులు, చిందేపల్లె వుధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రజలు కోడిపిల్లలు కాదు గంప కింద దాయుడానికి
బాబు చెబితే వినడానికి కుప్పం ప్రజలేమీ కోడిపిల్లలు కాదు గంప కింద దాయడానికి. ఇప్పటికీ బాబు నియుంతృత్వ ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. తొమ్మిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయునకు ఇంకా బుద్ధి రాలేదు. - రోజా, వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు
బాబుది ఏం వాదమో
రాష్ట్ర విభజన విషయుంలో చంద్రబాబుది ఏం వాదమో ఆయునకైనా తెలుసా? సొంత నియోజకవర్గంలో ఒక్కరైనా రాష్ట్ర విభజనకు సై అంటున్నారా? అలాంటప్పుడు వారి ప్రజాప్రతినిధిగా మీరు వూత్రం ఎలా విభజనకు లేఖ ఇస్తారు. దీన్ని ప్రజలు క్షమిక్షించరు.
- నారాయుణ స్వామి, పార్టీ జిల్లా కన్వీనర్
విభజన ద్రోహి చంద్రబాబే
రాష్ట్ర విభజనకు సోనియూగాంధీ, చంద్రబాబే కారణం. రాష్ట్రాన్ని ఓట్ల కోసం సీట్ల కోసం చీల్చడం న్యాయుం కాదు. కిరణ్ సమైక్య వుుసుగులోని విభజనవాది.
- దేశాయ్ తిప్పారెడ్డి,
ఎమ్మెల్సీ, మదనపల్లె
సమైక్య ఉద్యవూనికి చుక్కాని..
సమైక్య ఉద్యవూనికి జగన్ చుక్కానిలా వూ రారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే సమైక్యమే దిక్కు. జిల్లాకు చెందిన చంద్రబాబు విభజనకు కారణవువడం బాధాకరం.
- ఉదయ్‌కువూర్ రెడ్డి,
యుువజన విభాగం జిల్లా అధ్యక్షుడు
అంతా వుంచే జరుగుతుంది.,...
నాలుగైదు నెలల్లో అంతా వుంచే జరుగుతుంది. జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యవుంత్రి కావడం ఖాయుం. రాష్ట్రంలో జరుగుతున్న కుళ్ళుకుతంత్రాలను జనం గవునిస్తున్నారు. ఎన్నికల్లో వారి తఢాకా ఏంటో చూపిస్తారు.
- బియ్యుపు వుధుసూదన్ రెడ్డి,
సవున్వయుకర్త, శ్రీకాళహస్తి
సీఎం ఏమార్చుతున్నారు
రాష్ర్ట విభజన ప్రక్రియు వేగంగా జరుగుతున్నా ముఖ్యవుంత్రి కిరణ్‌కువూర్ రెడ్డి కల్లబొల్లి వూటలతో జనాన్ని ఏవూర్చే ప్రయుత్నం చేస్తున్నారు. ఇందుకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారు.
- షమీమ్ అస్లామ్, వుదనపల్లె సవున్వయుకర్త
కిరణ్ కవుల్ కంటే గొప్ప నటుడు
రాష్ట్ర విభజన అంశంలో ముఖ్యవుంత్రి కిరణ్ కువూర్ రెడ్డి కవుల్ కంటే గొప్పగా నటిస్తూ సీవూంధ్రులను ఏవూర్చుతున్నారు. పదండి వుుందుకన్న శ్రీశ్రీ స్పూర్తితో జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖాన్ని పూరిస్తున్నారు.
- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నియోజకవర్గ సవున్వయుకర్త, చంద్రగిరి
గుండె తలుపులు తెరుచుకున్న జనం
Published Mon, Dec 2 2013 2:55 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement
Advertisement