samiya shakaram
-
జనాభిమానం
సాక్షి, తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మూడోవిడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రలో భాగంగా ఆరవరోజైన శుక్రవారం ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. దారిపొడవునా వేలాదిమంది హారతులు, మేళతాళాలు, కోలాటాలతో ఆహ్వానం పలికారు. దామలచెరువు నుంచి బయలుదేరిన ఆయన నాలుగు చోట్ల వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. పాకాలలో వైఎస్.రాజశేఖరరెడ్డి మృతికి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విజయకుమార్ రెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు. వారికి మనోధైర్యం కల్పించారు. దామలచెరువు నుంచి బండార్లపల్లెకు చేరుకుని అక్కడ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గుమ్మడివారిపల్లెకు చేరుకున్న జగన్మోహన్రెడ్డికి టపాకాయలు పేల్చి, హారతులతో ఆహ్వానం పలికారు.ఊట్లవారిపల్లెలో పూలహా రాలతో స్వాగతం పలికారు. తర్వాత పాకాల లోని కమతంలో విజయభాస్కర్‌రెడ్డి కుటుం బాన్ని ఓదార్చారు. తోటపల్లె మీదుగా సామిరెడ్డిపల్లె చేరుకుని అక్కడ రోడ్‌షోలో పాల్గొని, వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ ఆయనకు పూల వర్షం కురిపించి స్వాగతించారు. తరువాత పూతలపట్టు నియోజకవర్గంలోకి ప్రవేశించి కరిణిపల్లెక్రాస్, పి.కొత్తకోట, గొల్లపల్లె, మిట్టూరు, రంగంపేట క్రాస్ ద్వారా పూతలపట్టుకు చేరుకున్నారు. పూతలపట్టులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కాణిపాకం క్రాస్ ద్వారా కిచ్చన్నగారిపల్లె చేరుకున్నారు. తర్వాత దిగువపాలకూరులో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గోపాలకృష్ణాపురం మీదుగా మూర్తిగానిపల్లెకు చేరుకుని అక్కడ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత ఐరాల మండలంలోకి ప్రవేశించి, చిగరపల్లె ద్వారా తిరువణంపల్లె చేరుకుని రాత్రి అక్కడే బసచేశారు. పర్యటనలో పలువురు వృద్ధులు, వికలాంగులను జగన్మోహన్రెడ్డి పలుకరిస్తూ వచ్చారు. వేలాదిమంది అభిమానులు పంట పొలాల నుంచి రోడ్డు మీదకు చేరుకుని ఆయనకు ఆహ్వానం పలికారు. పాకాలలో జననేతను మాజీ తెలుగుదేశం నాయకుడు ఎల్బి.ప్రభాకర్ కలుసుకున్నారు. పాకాలలో ఓదార్పు ముగిసిన తర్వాత కుప్పం నియోజకవర్గం సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి క్యాలెండర్ తీసుకుని రాగా, దానిని ఆవిష్కరించారు. వైఎస్ఆర్ సేవాదళ్ నాయకుడు చొక్కారెడ్డి జగదీశ్వరరెడ్డి, జగన్మోహన్రెడ్డికి తెలుగుతల్లి విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేశారు. యాత్ర చంద్రగిరి నియోజకవర్గం సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పూతలపట్టు కన్వీనర్ డాక్టర్ సునీల్‌కుమార్ నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు మిథున్ రెడ్డి, పార్టీ నాయకులు తలుపులపల్లి బాబు రెడ్డి, ఆశాలత, శైలజా రెడ్డి, గోవిందరెడ్డి, దామినేడు కేశవులు పాల్గొన్నారు. -
కదలివచ్చిన పల్లెలు
-
జగన్‌ను ముఖ్యమంత్రిని చేద్దాం
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: మనమంతా కలసికట్టుగా వైఎస్.జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని, రాజన్నపాలన వస్తుందని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ నేతలు పేర్కొన్నారు. ఆదివారం బి.కొత్తకోటలో జరిగిన సమైక్య శంఖారావం బహిరంగసభలో నాయకులు ప్రసంగించారు . రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు తీరాలన్నా, రాష్ట్రవిభజన ఆగాలన్న జగన్ ముఖ్యమంత్రి కావడంతోనే పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రజాదరణ ఓర్వలేకున్నారు వైఎస్.జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ చూసి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓర్వలేకున్నారు. ఆ అక్కసుతోనే జగన్‌ను జైలుకు పంపారు. జగన్ ప్రభంజనాన్ని ఏశ క్తీ అడ్డుకోలేదు. వైఎస్సార్కాంగ్రెస్పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థులను గెలిపించుకుని, జగన్‌ను సీఎం చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. దేశాయ్ తిప్పారెడ్డి, ఎమ్మెల్సీ అండగా నిలవాలి సమైక్యాంధ్ర విభజనకు అనుకూలంగా కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు వ్యవహరిసున్నారు. దీంతో రాష్ట్రం దిక్కులేకుండా పోయిన సమయంలో జగన్మోహన్రెడ్డి నేనున్నానంటూ సమైక్యం కోసం యాత్ర సాగిస్తున్నారు. దీనికి మనమంతా అండగా నిలవాలి. ఏవీ.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, తంబళ్లపల్లె జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి 104, 108, అభయహస్తం, మహిళా రుణాలు, ఆరోగ్యశ్రీ..ఒకటీ రెండుకాదు ఎన్నో సంక్షేమ పథకాలను రాజశేఖరరెడ్డి అమలుచేస్తే..ప్రస్తుత కాంగ్రెస్ప్రభుత్వం వైఎస్ పథకాలను తుంగలోకి తొక్కింది. రాష్ర్టం అభివృద్ధి చెందాలంటే మనమంతా జగన్‌ను సీఎం చేసేందుకు కష్టపడాలి. జీ.షమీంఅస్లాం, మదనపల్లె సమన్వయకర్త హంద్రీ-నీవా పూర్తవుతుంది జగన్‌ను సీఎం చేసి తంబళ్లపల్లెను అభివృద్ధి చేసుకుందాం. భారీ పరిశ్రమలను స్థాపించి 10వేలమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిద్దాం. జగన్ సీఎం అయితే హంద్రీ-నీవా ప్రాజెక్టు పూర్తి అవుతుంది. ఈ పనులు సాధించుకునేందుకు జగన్‌కు అండగా నిలబడాలి. ఎం.రంగారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు సమైక్యాంధ్రకు కట్టుబడిన నేత జగన్ సమైక్యాంధ్రకు కట్టుబడిన ఏకైక నేత జగన్మోహన్రెడ్డి. చంద్రబాబు ఇంతవరకు సమైక్యాంధ్ర అన్న పదం పలకలేదు. సీమాంధ్ర టీడీపీ నేతలు సమైక్యమంటారు, తెలంగాణ టీడీపీ నేతలు విభజన కావాలంటారు. ఈ పరిస్థితుల్లో జగన్‌ను ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఎంతోవుంది. గౌరీశంకర్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు -
అడుగడుగునా ఆత్మీయత
-
నేటి నుంచి రెండో విడత సమైక్య శంఖారావం
=రెండు కుటుంబాలకు ఓదార్పు =భారీ స్వాగత ఏర్పాట్లు సాక్షి, తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రెండవ విడత సమైక్య శంఖారావం జిల్లాలో శుక్రవారం ప్రారంభం కానుంది. బెంగళూరు నుంచి ఉదయం పలమనేరు సమీపంలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు చేరుకునే ఆయనకు జంగాలపల్లె వద్ద భారీ స్వాగత ఏర్పాట్లు చేపట్టారు. పలమనేరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అమరనాథ రెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి తదితరులు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఆయనకు పలు ప్రాంతాల్లో స్వాగత ఏర్పాట్లు చేపట్టారు. భారీ ఎత్తున ఫ్లెక్సీలు, పార్టీ పతాకాలను ఏర్పాటు చేశారు. వీరితో పాటు జిల్లాలోని అన్ని నియోజక వర్గాల సమన్వయకర్తలు జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలుకనున్నారు. నాలుగు రోడ్ల వద్ద మధ్యాహ్నం 12 గంటలకు జరిగే బహిరంగ సభలో వైఎస్.జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు. సభకు హాజరయ్యేందుకు పలమనేరు నుంచే కాకుండా సరిహద్దు నియోజకవర్గాలైన చిత్తూరు, పుంగనూరు లాంటి ప్రాంతాల నుంచి అభిమానులు చేరుకుంటున్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైన కుప్పంలో గత నెల 29వ తేదీన తొలివిడత సమైక్య శంఖారావం ప్రారంభించిన విషయం తెలిసిందే. సమైక్య శంఖారావానికి ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చింది. మూడు రోజుల పాటు జరిగిన ఆ యాత్ర పలమనేరు నియోజకవర్గంలోని బెరైడ్డిపల్లెలో ముగిసింది. రెండవ విడత యాత్ర అదే నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్నారు. పలమనేరు, పుంగనూరు నుంచి మదనపల్లి వరకు ఈ యాత్ర కొనసాగే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. సమైక్య శంఖారావంతో పాటు, వైఎస్.రాజశేఖరరెడ్డి మరణించడాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను జగన్మోహన్రెడ్డి ఓదార్చుతారు. పలమనేరు నియోజకవర్గంలో రెండు కుటుంబాలను ఓదార్చనున్నారు. రెండవ విడత సమైక్య శంఖారావంలో నాలుగురోడ్ల జంక్షన్ వద్ద బహిరంగ సభ ముగించుకుని, పత్తికొండ, మామడుగు, ఆర్టీఏ చెక్‌పోస్టు, నక్కపల్లి, కొలమాసన పల్లి, శంకర్రాయలపేట, అప్పినపల్లి, పెద్దవెలగటూరులలో జగన్మోహన్రెడ్డి పర్యటిస్తారు. ఈ కార్యక్రమాలతో పాటు వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. -
న్యాయవాదులు.. ఉపాధ్యాయులు.. దేశానికి పట్టుగొమ్మలు
=తెలంగాణ బిల్లుకు అసెంబ్లీలో మద్దతు రాదు =న్యాయవాదుల శంఖారావంలో ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు విజయవాడ, న్యూస్‌లైన్ : దేశానికి న్యాయవాదులు, ఉపాధ్యాయులే పట్టుగొమ్మలని, స్వాతంత్య్రోద్యమంలో కూడా వారే ముందుండి నడిపించారని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) ఆధ్వర్యంలో న్యాయవాద సమైక్య శంఖారావం సభను స్థానిక నక్కలరోడ్డు కూడలి వద్ద అమరజీవి పొట్టిశ్రీరాములు ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. ముఖ్య అతిథిగా హాజరైన అశోక్‌బాబు మాట్లాడుతూ ఉద్యమానికి న్యాయవాదులు కళ్లూ చెవులని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చాలా దూకుడుగా, దుర్మార్గంగా ఆలోచిస్తోందన్నారు. రైతులు రెండు తుపానులతో విలవిలలాడుతుంటే వారి బాధలు గాలికొదిలేసి రాష్ట్రాన్ని ఎలా విడగొట్టాలా అని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. తెలంగాణ బిల్లుకు అసెంబ్లీలో మద్దతు రాదని ఆయన చెప్పారు. జీవోఎంలో మంత్రులు.. ఎందుకు పనికిరారు... 13 జిల్లాల జేఏసీ కన్వీనర్, బీబీఏ అధ్యక్షుడు మట్టా జయకర్ మాట్లాడుతూ జీవోఎంలో ఉన్న మంత్రులు వారి రాష్ట్రాలలో ఎందుకు పనికిరారని, వాళ్ల నాయకత్వాన్ని ఆ రాష్ట్ర ప్రజలు వద్దనుకున్నారని దుయ్యబట్టారు. అవిశ్వాసానికి నోటీసులిచ్చిన ఎంపీలను గౌరవిస్తున్నామని చెప్పారు. ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ను ఆ పార్టీ ఎంపీలే విశ్వసించలేదని ఎద్దేవా చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికినే కోల్పోతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు సహకరించిన ఎంపీలు, శాసనసభ్యులు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. విద్యార్థులు, మహిళలు, న్యాయవాదులు, ఉద్యోగులు తదితర జేఏసీలతో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. పార్టీలతో ప్రమేయం లేకుండా అందరు సమైక్యాంధ్రకు మద్దతునిస్తారని చెప్పారు. రాహుల్‌ని ప్రధానిని చేయడానికి సోనియా అష్టకష్టాలు పడుతోందని విమర్శించారు. ఇది ఆఖరి పోరాటం... హైకోర్టు న్యాయవాది సీహెచ్ కోటేశ్వరి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి తమది ఆఖరు పోరాటమన్నారు. దిగ్విజయ్‌సింగ్‌కి దమ్ముంటే సీమాంద్ర ప్రజలలో తిరగాలన్నారు. నజరానాల కోసమో, సూట్‌కేసుల కోసమో రాజకీయ నాయకులు చూడకుండా ప్రభుత్వాలను త్వరగా పడ గొట్టాలని కోరారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్, ముప్పాల సుబ్బారావు, గోకుల్‌కృష్ణ, కనకమేడల రవీంద్రకుమార్, మచిలీపట్నం బార్ అధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు, గోగుశెట్టి వెంకటేశ్వరరావు, నరహరిశెట్టి శ్రీహరి, చోడిశెట్టి మన్మథరావు, ఎన్ఎస్ రాజు, వలిబోయిన కిరణకుమార్, ఆటోనగర్ టెక్నీషియన్ అసోసియేషన్ నాయకులు ఎ.నాగేశ్వరరావు, వేముల హజరత్తయ్య గుప్తా, కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ వి.నారాయణరావు, పిళ్లా రవి, విద్యాసాగర్ ప్రసంగించారు. సమావేశానికి ముందు మహిళా న్యాయవాదులు వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వేదిక పైకి వక్తలను బీబీఏ ప్రధాన కార్యదర్శి లాం చిన ఇజ్రాయేల్ ఆహ్వానించారు. -
గుండె తలుపులు తెరుచుకున్న జనం
పలవునేరు, న్యూస్‌లైన్: కుప్పంకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖారా వం యాత్రకు వస్తే ఇళ్ల తలుపులు వేసుకోవుని టీడీపీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు చెబితే,అదే జనం వారి గుండె తలుపులు తెరుచుకుని జగన్మోహన్ రెడ్డికి ఆత్మీయు స్వాగతం పలికారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు పేర్కొన్నారు. సమైక్య శంఖారావం బహిరంగ సభ ఆదివా రం వుండల కేంద్రమైన వి.కోటలో జరిగింది. ఈ కార్యక్రవూనికి పలవునేరు నియోజకవర్గవాసులే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి సైతం వేలాది వుంది తరలివచ్చారు. ఈసభలో జిల్లా స్థాయి నాయుకులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ప్రసంగించారు. రాజంపే ట పార్లమెంట్ ఇన్చార్జ్ మిధున్ రెడ్డి, తంబళ్లపల్లె వూజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కువూర్ రెడ్డి, లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ రెడ్డెప్ప, పూతలపట్టు సవున్వయుకర్త డాక్టర్ సునీల్, రాష్ట్ర యువజన కార్యవర్గ సభ్యుడు అరుణ్కువూర్ రెడ్డి, పూతలపట్టు నాయుకులు కేశవులు, చిందేపల్లె వుధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలు కోడిపిల్లలు కాదు గంప కింద దాయుడానికి బాబు చెబితే వినడానికి కుప్పం ప్రజలేమీ కోడిపిల్లలు కాదు గంప కింద దాయడానికి. ఇప్పటికీ బాబు నియుంతృత్వ ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. తొమ్మిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయునకు ఇంకా బుద్ధి రాలేదు. - రోజా, వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు బాబుది ఏం వాదమో రాష్ట్ర విభజన విషయుంలో చంద్రబాబుది ఏం వాదమో ఆయునకైనా తెలుసా? సొంత నియోజకవర్గంలో ఒక్కరైనా రాష్ట్ర విభజనకు సై అంటున్నారా? అలాంటప్పుడు వారి ప్రజాప్రతినిధిగా మీరు వూత్రం ఎలా విభజనకు లేఖ ఇస్తారు. దీన్ని ప్రజలు క్షమిక్షించరు. - నారాయుణ స్వామి, పార్టీ జిల్లా కన్వీనర్ విభజన ద్రోహి చంద్రబాబే రాష్ట్ర విభజనకు సోనియూగాంధీ, చంద్రబాబే కారణం. రాష్ట్రాన్ని ఓట్ల కోసం సీట్ల కోసం చీల్చడం న్యాయుం కాదు. కిరణ్ సమైక్య వుుసుగులోని విభజనవాది. - దేశాయ్ తిప్పారెడ్డి, ఎమ్మెల్సీ, మదనపల్లె సమైక్య ఉద్యవూనికి చుక్కాని.. సమైక్య ఉద్యవూనికి జగన్ చుక్కానిలా వూ రారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే సమైక్యమే దిక్కు. జిల్లాకు చెందిన చంద్రబాబు విభజనకు కారణవువడం బాధాకరం. - ఉదయ్‌కువూర్ రెడ్డి, యుువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అంతా వుంచే జరుగుతుంది.,... నాలుగైదు నెలల్లో అంతా వుంచే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యవుంత్రి కావడం ఖాయుం. రాష్ట్రంలో జరుగుతున్న కుళ్ళుకుతంత్రాలను జనం గవునిస్తున్నారు. ఎన్నికల్లో వారి తఢాకా ఏంటో చూపిస్తారు. - బియ్యుపు వుధుసూదన్ రెడ్డి, సవున్వయుకర్త, శ్రీకాళహస్తి సీఎం ఏమార్చుతున్నారు రాష్ర్ట విభజన ప్రక్రియు వేగంగా జరుగుతున్నా ముఖ్యవుంత్రి కిరణ్కువూర్ రెడ్డి కల్లబొల్లి వూటలతో జనాన్ని ఏవూర్చే ప్రయుత్నం చేస్తున్నారు. ఇందుకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారు. - షమీమ్ అస్లామ్, వుదనపల్లె సవున్వయుకర్త కిరణ్ కవుల్ కంటే గొప్ప నటుడు రాష్ట్ర విభజన అంశంలో ముఖ్యవుంత్రి కిరణ్ కువూర్ రెడ్డి కవుల్ కంటే గొప్పగా నటిస్తూ సీవూంధ్రులను ఏవూర్చుతున్నారు. పదండి వుుందుకన్న శ్రీశ్రీ స్పూర్తితో జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖాన్ని పూరిస్తున్నారు. - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నియోజకవర్గ సవున్వయుకర్త, చంద్రగిరి -
గుండె తలుపులు తెరుచుకున్న జనం
పలవునేరు, న్యూస్‌లైన్: కుప్పంకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖారా వం యాత్రకు వస్తే ఇళ్ల తలుపులు వేసుకోవుని టీడీపీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు చెబితే,అదే జనం వారి గుండె తలుపులు తెరుచుకుని జగన్మోహన్ రెడ్డికి ఆత్మీయు స్వాగతం పలికారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు పేర్కొన్నారు. సమైక్య శంఖారావం బహిరంగ సభ ఆదివా రం వుండల కేంద్రమైన వి.కోటలో జరిగింది. ఈ కార్యక్రవూనికి పలవునేరు నియోజకవర్గవాసులే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి సైతం వేలాది వుంది తరలివచ్చారు. ఈసభలో జిల్లా స్థాయి నాయుకులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ప్రసంగించారు. రాజంపే ట పార్లమెంట్ ఇన్చార్జ్ మిధున్ రెడ్డి, తంబళ్లపల్లె వూజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కువూర్ రెడ్డి, లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ రెడ్డెప్ప, పూతలపట్టు సవున్వయుకర్త డాక్టర్ సునీల్, రాష్ట్ర యువజన కార్యవర్గ సభ్యుడు అరుణ్కువూర్ రెడ్డి, పూతలపట్టు నాయుకులు కేశవులు, చిందేపల్లె వుధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలు కోడిపిల్లలు కాదు గంప కింద దాయుడానికి బాబు చెబితే వినడానికి కుప్పం ప్రజలేమీ కోడిపిల్లలు కాదు గంప కింద దాయడానికి. ఇప్పటికీ బాబు నియుంతృత్వ ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. తొమ్మిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయునకు ఇంకా బుద్ధి రాలేదు. - రోజా, వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు బాబుది ఏం వాదమో రాష్ట్ర విభజన విషయుంలో చంద్రబాబుది ఏం వాదమో ఆయునకైనా తెలుసా? సొంత నియోజకవర్గంలో ఒక్కరైనా రాష్ట్ర విభజనకు సై అంటున్నారా? అలాంటప్పుడు వారి ప్రజాప్రతినిధిగా మీరు వూత్రం ఎలా విభజనకు లేఖ ఇస్తారు. దీన్ని ప్రజలు క్షమిక్షించరు. - నారాయుణ స్వామి, పార్టీ జిల్లా కన్వీనర్ విభజన ద్రోహి చంద్రబాబే రాష్ట్ర విభజనకు సోనియూగాంధీ, చంద్రబాబే కారణం. రాష్ట్రాన్ని ఓట్ల కోసం సీట్ల కోసం చీల్చడం న్యాయుం కాదు. కిరణ్ సమైక్య వుుసుగులోని విభజనవాది. - దేశాయ్ తిప్పారెడ్డి, ఎమ్మెల్సీ, మదనపల్లె సమైక్య ఉద్యవూనికి చుక్కాని.. సమైక్య ఉద్యవూనికి జగన్ చుక్కానిలా వూ రారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే సమైక్యమే దిక్కు. జిల్లాకు చెందిన చంద్రబాబు విభజనకు కారణవువడం బాధాకరం. - ఉదయ్‌కువూర్ రెడ్డి, యుువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అంతా వుంచే జరుగుతుంది.,... నాలుగైదు నెలల్లో అంతా వుంచే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యవుంత్రి కావడం ఖాయుం. రాష్ట్రంలో జరుగుతున్న కుళ్ళుకుతంత్రాలను జనం గవునిస్తున్నారు. ఎన్నికల్లో వారి తఢాకా ఏంటో చూపిస్తారు. - బియ్యుపు వుధుసూదన్ రెడ్డి, సవున్వయుకర్త, శ్రీకాళహస్తి సీఎం ఏమార్చుతున్నారు రాష్ర్ట విభజన ప్రక్రియు వేగంగా జరుగుతున్నా ముఖ్యవుంత్రి కిరణ్కువూర్ రెడ్డి కల్లబొల్లి వూటలతో జనాన్ని ఏవూర్చే ప్రయుత్నం చేస్తున్నారు. ఇందుకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారు. - షమీమ్ అస్లామ్, వుదనపల్లె సవున్వయుకర్త కిరణ్ కవుల్ కంటే గొప్ప నటుడు రాష్ట్ర విభజన అంశంలో ముఖ్యవుంత్రి కిరణ్ కువూర్ రెడ్డి కవుల్ కంటే గొప్పగా నటిస్తూ సీవూంధ్రులను ఏవూర్చుతున్నారు. పదండి వుుందుకన్న శ్రీశ్రీ స్పూర్తితో జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖాన్ని పూరిస్తున్నారు. - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నియోజకవర్గ సవున్వయుకర్త, చంద్రగిరి