బి.కొత్తకోట, న్యూస్‌లైన్: మనమంతా కలసికట్టుగా వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని, రాజన్నపాలన వస్తుందని వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ నేతలు పేర్కొన్నారు. ఆదివారం బి.కొత్తకోటలో జరిగిన సమైక్య శంఖారావం బహిరంగసభలో నాయకులు ప్రసంగించారు . రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు తీరాలన్నా, రాష్ట్రవిభజన ఆగాలన్న జగన్ ముఖ్యమంత్రి కావడంతోనే పరిష్కారం లభిస్తుందన్నారు.
ప్రజాదరణ ఓర్వలేకున్నారు
వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ చూసి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓర్వలేకున్నారు. ఆ అక్కసుతోనే జగన్‌ను జైలుకు పంపారు. జగన్ ప్రభంజనాన్ని ఏశ క్తీ అడ్డుకోలేదు. వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థులను గెలిపించుకుని, జగన్‌ను సీఎం చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం.
దేశాయ్ తిప్పారెడ్డి, ఎమ్మెల్సీ
అండగా నిలవాలి
సమైక్యాంధ్ర విభజనకు అనుకూలంగా కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు వ్యవహరిసున్నారు. దీంతో రాష్ట్రం దిక్కులేకుండా పోయిన సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి నేనున్నానంటూ సమైక్యం కోసం యాత్ర సాగిస్తున్నారు. దీనికి మనమంతా అండగా నిలవాలి.
ఏవీ.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, తంబళ్లపల్లె
జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి
104, 108, అభయహస్తం, మహిళా రుణాలు, ఆరోగ్యశ్రీ..ఒకటీ రెండుకాదు ఎన్నో సంక్షేమ పథకాలను రాజశేఖరరెడ్డి అమలుచేస్తే..ప్రస్తుత కాంగ్రెస్‌ప్రభుత్వం వైఎస్ పథకాలను తుంగలోకి తొక్కింది. రాష్ర్టం అభివృద్ధి చెందాలంటే మనమంతా జగన్‌ను సీఎం చేసేందుకు కష్టపడాలి.
జీ.షమీంఅస్లాం, మదనపల్లె సమన్వయకర్త
హంద్రీ-నీవా పూర్తవుతుంది
జగన్‌ను సీఎం చేసి తంబళ్లపల్లెను అభివృద్ధి చేసుకుందాం. భారీ పరిశ్రమలను స్థాపించి 10వేలమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిద్దాం. జగన్ సీఎం అయితే హంద్రీ-నీవా ప్రాజెక్టు పూర్తి అవుతుంది. ఈ పనులు సాధించుకునేందుకు జగన్‌కు అండగా నిలబడాలి.
ఎం.రంగారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు
సమైక్యాంధ్రకు కట్టుబడిన నేత జగన్
సమైక్యాంధ్రకు కట్టుబడిన ఏకైక నేత జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబు ఇంతవరకు సమైక్యాంధ్ర అన్న పదం పలకలేదు. సీమాంధ్ర టీడీపీ నేతలు సమైక్యమంటారు, తెలంగాణ టీడీపీ నేతలు విభజన కావాలంటారు. ఈ పరిస్థితుల్లో జగన్‌ను ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఎంతోవుంది.
గౌరీశంకర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు
జగన్‌ను ముఖ్యమంత్రిని చేద్దాం
Published Mon, Jan 6 2014 3:29 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement