విజయనగరం : అకాల వర్షంతో విజయనగరం వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం సాయంత్రం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ నీట మునిగాయి. దీంతో రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారుల పరిస్థితి బురద మయం అయింది. ఆదివారం కావడంతో.. మార్కెట్(అంగడి) వద్ద సందడి ఎక్కువవడంతో.. కూరగాయలు కొనడానికి వచ్చిన స్థానికులతో పాటు విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.