సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గురువారం ఉదయం భారీగా వర్షం కురుస్తోంది. రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, కొండాపురం మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. అలాగే రాజంపేట, నందలూరు, కమలాపురంలో కూడా వర్షం కురుస్తోంది. కాగా... సుండుపల్లె మండలం బేస్తవారిపల్లి గ్రామం దగ్గర వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది.
బహుదా నది కాజ్ వే మీదుగా బస్సు వెళ్తుండగా ఒక్కసారిగా వరద రావడంతో బస్సు మద్యలోనే ఆగిపోయింది. గమనించిన గ్రామస్తులు హుటాహుటిన అక్కడకు చేరుకుని బస్సులో చిక్కుకున్న వారిని రక్షించారు. ఆ సమయంలో బస్సులో మొత్తం 15 మంది ప్రయాణికులున్నారు. గ్రామస్తులు రాక కొంచెం ఆలస్యమైనా పెనుప్రమాదం చోటుచేసుకునేదని ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment