విశాఖపట్నం : జార్ఖండ్, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో అల్పపీడనం తీవ్రంగా కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అది క్రమేణా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రాంతం నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం చెప్పింది.