రామకుప్పం (చిత్తూరు జిల్లా) : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా రామకుప్పం, ముద్దనపల్లె గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం రెండు ఇళ్లు కూలిపోయాయి. రామకుప్పంలో ఒక ఇల్లు ధ్వంసం కాగా, ముద్దనపల్లెలో మరో ఇల్లు కూలిపోయింది. అలాగే ఎస్.గొల్లపల్లె చెరువుకు గండి పడింది. గ్రామస్తులు ఇసుక బస్తాలను వేసినా ప్రయోజనం లేకపోయింది. చెరువులో నీళ్లన్నీ ఖాళీ అయిపోయాయి.