జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో భద్రాచలంలోని గోదావరి నదికి శనివారం భారీగా వరద పొటెత్తింది. నదిలో
నీటిమట్టం 43.4 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. కాగా మరోవైపు జిల్లాలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గుండాల మండలంలోని ముర్రెడు, మల్లన్న, జల్లేరు, నడివాగు,దున్నపోతుల వాగులు ప్రవాహ ఉధృతి మించి ప్రవహిస్తున్నాయి. దాంతో 50 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
బయ్యారం మండలంలోని పెద్ద చెరువు, అలుగు పడి జిన్నెలవర్రెలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఇల్లందు, మహబూబాబాద్ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించింది. దీంతో అయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.