వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తుండటంతో ముద్దునూరు మండలం కలమలలలోని కృష్ణా నగర్వంక పొంగిపొర్లుతుంది. బుధవారం ఉదయం ఆ నీటి ప్రవాహంలో పడి ఓ మహిళ మృతి చెందింది. మరో మహిళ గల్లంతు అయింది. స్థానికులు గల్లంతు అయిన మహిళను రక్షించేందుకు శత విధాల ప్రయత్నించారు. అయితే నీటి ప్రవాహ ఉధృతి మరింత తీవ్రంగా ఉండటంతో స్థానికులు మిన్నకుండిపోయారు.
అలాగే జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా చన్నమండం మండలం వరద పోటెత్తింది. దాంతో సన్నజాతి పశుసంపద దెబ్బతింది. అలాగే మాండవ్య నది వేగం ప్రవహిస్తుంది. రహదారులు ఎక్కికక్కడ తెగిపోయాయి. వీటితోపాటు శ్రీనివాస రిజర్వాయర్లో వరద నీరు భారీగా చేరింది.దాంతో సమీపంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. బద్వేలులో భారీ వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఆ ప్రాంతంలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి.
అనంతపురం జిల్లాలో పుట్టపర్తిలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని చిత్రావతి నది పొంగి పొర్లుతుంది. కొత్తచెరువు మండలంలో భారీగా వర్షం కురిసింది. వంగపేరు నది ప్రవాహంలో పడి రైతు గల్లంతయ్యాడు. అదే జిల్లాలోని ధర్మవరంలో భారీ వర్షం నమోదు అయింది. తుంపర్తివాగులో మగ్గురు గ్రామస్తులు చిక్కుకున్నారు. తమను రక్షించాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారిని రక్షించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.