మహానందికి పోటెత్తిన భక్తులు | heavy rush in mahanandi temple | Sakshi
Sakshi News home page

మహానందికి పోటెత్తిన భక్తులు

Published Mon, Dec 7 2015 2:02 PM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM

heavy rush in mahanandi temple

మహానంది: కర్నూలు జిల్లా మహానందీశ్వరుడి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్వామి దర్శనం కోసం 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. దాదాపు 60 వేల మంది భక్తులు నందీశ్వరుడి దర్శనం కోసం వేచి ఉన్నారు. 
 
కాగా ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, దేవాదాయ శాఖా మంత్రి మాణిక్యాల రావు ఈ రోజు స్వామిని దర్శించుకున్నారు. వారి కోసం భక్తుల దర్శనాలను అరగంట సేపు నిలిపివేయడంతో భక్తులు దేవస్ధానం సిబ్బందిపై మండిపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement