
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉమ్మడి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాజీ సర్పంచులు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు స్పందిస్తూ.. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేశించింది. సర్పంచుల పదవీ కాలం ఆగస్ట్‌లోనే ముగియడంతో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తోంది. దానిని కొనసాగిస్తూ ఇటీవల ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.90ను హైకోర్టు కొట్టివేసింది.
చివరిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పదవీ కాలం ముగిసిన తెలంగాణలోని పంచాయతీలకు కూడా మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల హైకోర్టు అదేశించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment