'మంత్రి భర్త మైనింగ్పై విచారణ జరపండి' | High Court orders probe against minister's kin | Sakshi
Sakshi News home page

'మంత్రి భర్త మైనింగ్పై విచారణ జరపండి'

Published Tue, Nov 19 2013 9:07 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

'మంత్రి భర్త మైనింగ్పై విచారణ జరపండి' - Sakshi

'మంత్రి భర్త మైనింగ్పై విచారణ జరపండి'

మహబూబ్ నగర్ : రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డి.కె.అరుణ భర్త భరతసింహారెడ్డిపై వచ్చిన అక్రమ మైనింగ్, రేషన్ కిరోసిన్ అక్రమ వినియోగం తదితర ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని మహబూబ్నగర్ జిల్లా అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

భరత్సింహారెడ్డి మన్నాపురం గ్రామ పరిధిలోని భూమిలో చేస్తున్న మైనింగ్లో అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదంటూ గద్వాల్ టౌన్కు చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బి.కృష్ణమోహన్ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement