అనంతపురం: అనంతపురం జిల్లాలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉద్రిక్తంగా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డిని ఆర్టీసీ కార్మికులు బుధవారం అడ్డుకున్నారు.అలాగే కదిరి పట్టణంలో ఆర్టీసీ బస్సును కార్మికులు ధ్వంసం చేశారు. హిందూపురంలో ఆర్టీసీ బస్సును నడిపేందుకు ప్రయత్నించిన ప్రైవేట్ ఉద్యోగిపై ఆర్టీసీ ఉద్యోగులు దాడి చేశారు.
దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి దాడి చేసిన ఉద్యోగులకు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల చేపట్టిన సమ్మెకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్బాషా మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజుకు చేరుకుంది.