ప్రభుత్వ ఉద్యోగులకు సెలవుల రద్దు | Holidays cancelled for government employees | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులకు సెలవుల రద్దు

Published Sun, Aug 13 2017 7:11 AM | Last Updated on Sun, Sep 17 2017 5:29 PM

ప్రభుత్వ ఉద్యోగులకు సెలవుల రద్దు

ప్రభుత్వ ఉద్యోగులకు సెలవుల రద్దు

- భారీ వర్షం హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్‌ నిర్ణయం
ఒంగోలు:
రుతుపవనాల ప్రభావం కారణంగా జిల్లాలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణశాఖ హెచ్చరికల దృష్ట్యా అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కోస్తా తీర ప్రాంత అధికారులతో పాటు అన్ని మండల స్థాయి అధికారులు మండల కేంద్రాల్లో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాజ్‌వేలు, లో లెవల్‌ బ్రిడ్జిల వద్ద పరిస్థితులను గమనించి ప్రయాణాలు కొనసాగించాలని సూచించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు, సాయం పొందేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టోల్‌ ఫ్రీ నంబర్‌ 1077 లేదా ల్యాండ్‌ లైన్‌ నంబర్‌ 08592 – 281400కు ఫోన్‌ చేయాలని కలెక్టర్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement