హాల్ట్ ఇచ్చినట్టే ఇచ్చి... | Holt's decision to abolish the | Sakshi
Sakshi News home page

హాల్ట్ ఇచ్చినట్టే ఇచ్చి...

Published Sat, May 10 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM

హాల్ట్ ఇచ్చినట్టే ఇచ్చి...

హాల్ట్ ఇచ్చినట్టే ఇచ్చి...

  • ‘గూడెం’లో కోరమాండల్, స్వర్ణజయంతి హాల్ట్ రద్దుకు నిర్ణయం
  • తాడేపల్లిగూడెంలో కోరమాండల్, స్వర్ణజయంతిరైళ్ల హాల్ట్ రద్దుకు నిర్ణయం
  • హాల్ట్ రద్దు జాబితాలో గరీబ్థ్,్ర ఇతర రైళ్లు
  • ఆదరణ, ఆదాయం లేకపోవడం వల్లేనని అధికారుల వెల్లడి 
  •  తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్‌లో ఇటీవల ఇచ్చిన పలు సూపర్‌ఫాస్ట్ రైళ్ల హాల్ట్‌లను రైల్వే అధికారులు రద్దు చేయనున్నారు. ఈ నెల 25 నుంచి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ హాల్టు రద్దు కానుండగా జూన్ 8 నుంచి స్వర్ణజయం తి హాల్టు రద్దు జాబితాలో చేర్చారు. ప్రయోగాత్మకంగా ట్రయల్ బేసిస్‌తో నడిపిన ఈ రైళ్లకు తగినంతగా ఆదా యం లేకపోవడం, ప్రయాణికులు ఎక్కకపోవడం కారణంగా రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే రైల్వే ఉన్నతాధికారుల నుంచి స్థానిక అధికారులకు సమాచారం అం దింది. ఈ రెండు రైళ్లు కాకుండా ఇటీవల హాల్టులు ఇచ్చిన మరో రెండు రైళ్లను కూడా రద్దు చేయనున్నట్టు సమాచారం.

     హాల్ట్ కోసం ఉద్యమించిన పట్టణ ప్రజలు
     సూపర్‌ఫాస్ట్ రైళ్లను తాడేపల్లిగూడెం స్టేషన్‌లో హాల్ట్ ఇవ్వాలని పట్టణ ప్రజలు కొన్నేళ్లుగా ఉద్యమం సాగించారు. ప్రజల ఉద్యమానికి తలొగ్గిన ప్రజాప్రతినిధులు ఎట్టకేలకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు సాగించి గూడెంలో పలు రైళ్లకు హాల్ట్ సౌకర్యం కల్పించారు. కోరమాండల్ రైలు ప్రవేశపెట్టిన తర్వాత 35 సంవత్సరాల అనంతరం తొలి అదనపు హాల్టును తాడేపల్లిగూడెంలో ఇచ్చారు. ఈ రైలుకు ఇక్కడ హాల్టు ఇచ్చినప్పటికీ 500 కిలోమీటర్ల పైబడి ప్రయాణానికి మాత్రమే టికెట్లు ఇచ్చేవారు. ఈ దూరం  లోపు ప్రయాణించే వారికి టికెట్లు ఇచ్చే వీలు లేదు. ఈ నిబంధన ప్రయాణికులకు ఇబ్బందిగా మారడంతో కోరమాండల్ రైలుకు గూడెంలో ఆదరణ కరువవడంతో రైల్వేకు ఆశించినంతగా ఆదాయం రాలేదు. దీంతో ఈ నెల 25 నుంచి హాల్ట్‌ను రద్దు చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు.
     
    స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌కు కూడా ఆదరణ పెద్దగా లేకపోవడం, ఆదాయం రాకపోవడంతో రద్దు కానుంది. గరీబ్థ్ ్రరైలు కూడా రద్దయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ రైలుకు విశాఖ రూట్‌లో మాత్రమే ఆదాయం రావడం, సికింద్రాబాద్ రూట్‌లో ఆదాయం లేకపోవడంతో రద్దు జాబితాలో ఈ రైలునూ చేర్చారు. అమరావతి, సంత్రాగచ్చి, యశ్వంత్‌పూర్, లోకమాన్య తిలక్ సూపర్ ఫాస్ట్ రైళ్లలో మరోదానికి కూడా హాల్ట్ రద్దు కానుందని తెలిసింది. రద్దు జాబితాలో చేరిన రైళ్లను పరిరక్షించుకుని ఇక్కడ ఆగేలా చేసుకోవాలంటే ప్రజలు మరోసారి ఉద్యమించాల్సి ఉంది. మరో ఆరునెలల కాలం ఈ రైళ్ల హాల్టులను పొడిగించేలా ఒప్పించాల్సి ఉంటుంది.

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement