ఉమ్మడి రాజధానిలో ఎంట్రీ ట్యాక్స్ ఎందుకు?
హైదరాబాద్: ఏపీ వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం విధించిన ఎంట్రీ టాక్స్ పై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. జీవో 15ను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగాలని విభజన చట్టంలో ఉన్నప్పుడు ప్రత్యేక పన్నులు ఎలా వసూలు చేస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.
ప్రవేశపన్ను మాత్రమే విధిస్తున్నామని, పర్మిట్ పన్నులు వసూలు చేయడం లేదని తెలంగాణ ప్రభుత్వం తరపు లాయర్ పేర్కొన్నారు. హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధాని మాత్రమేనని, కేంద్రపాలిత ప్రాంతం కాదన్నారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 72 వాహన పన్నుల విధింపుకు వెసులుబాటు కల్పిస్తోందని తెలిపారు.