పీఎన్‌కాలనీ: హుదూద్ తుపాను జిల్లాలోని పారిశ్రామిక రంగాన్ని సైతం కుదేలు చేసింది. ఆ రంగానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. గుండు సూది మొదలుకొని బడాకంపెనీలు సైతం నష్టాల అంచనా వేసే పనిలో పడ్డారు. శ్రీకాకుళం జిల్లా పరిధిలో రూ. 86 కోట్లు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చాయి. శనివారం ఈ మేరకు శ్రీకాకుళంలోని హోటల్ గ్రాండ్‌లో వివిధ పరిశ్రమల ఉన్నతస్థాయి సిబ్బందితో నష్టాల అంచనాపై జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జి.గోపాలరావు నే తృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘటితంగా తుపాను నష్ట భారాన్ని అధిగమించేందుకు కలసి రావాలన్నారు. ఈ నష్టాలను సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయడంతో పాటు జిల్లాలో అన్ని పరిశ్రమలకు సంబంధించి సహాయసహాకారాలు పొందేందుకు నష్టం వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు వెల్లడించారు. అంతకుముందు పలు కంపెనీల ప్రతినిధులు తాము చవిచూసిన నష్టాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
పలు కంపెనీల్లో నష్టాలు ఇలా....
జిల్లాలో పలు పరిశ్రమలకు సుమారు రూ. 86 కోట్లు నష్టాలు వచ్చినట్టు ఆయూన సంస్థల ప్రతినిధులు సమావేశంలో వివరించారు. వేలాదిమందికి జీవనోపాధి కల్పించే పరిశ్రమలపై ప్రకృతి కన్నెర్ర చేయడంతో కోట్లాది రూపాయలు నష్టపోయూమని వాపోయూరు. ఇప్పటికే విద్యుత్ లేమితో పరిశ్రమలు మూతపడ్డాయని, కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. తుపాను కారణంగా ట్రైమేక్స్ రూ. 25 కోట్లు, శాంపిస్టన్ రూ. 15.30 కోట్లు, సుప్రాన్ కాయిర్స్ రూ. 3 కోట్లు నష్టపోరుునట్టు ఆయూ సంస్థల ప్రతినిధులు వివరించారు. సమావేశంలో పరిశ్రమలశాఖ అసిస్టెం ట్ డెరైక్టర్ ఎస్.ప్రసాదరావు, ఐపీవో డి.రవికుమార్ పాల్గొన్నారు.
వైభవంగా ఆదిత్యుని క్షీరాభిషేకం
అరసవల్లి: అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామికి వైభవంగా క్షీరాభిషేకాన్ని అర్చకులు నిర్వహించారు. శనివారం ఉదయం నాలుగు గంటలకు స్వామివారి ఆభరణాలు తొలగించి, అనంతరం భక్తులను అభిషేక సేవకు అనుమతించారు. సుగంధద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. స్వామివారు భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారు. పాల్గొన్న భక్తులకు స్వామివారి ఆశీర్వచనం, ప్రత్యేక కోవా ప్రసాదాన్ని అర్చకులు అందజేశారు. తులా సంక్రమణం సందర్భంగా స్వామివారికి క్షీరాభిషేకాన్ని నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు.
హుదూద్ దెబ్బకు పరిశ్రమలు కుదేలు !
Published Sun, Oct 19 2014 2:39 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement