'పవన్ ఏ ఉద్దేశంతో మాట్లాడారో మాకు తెలీదు'
తిరుపతి: జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడారో లేక ఏ ఉద్దేశంతో మాట్లాడారో మాకు తెలిదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం తిరుపతి పర్యటనలో ఉన్న అచ్చెన్నాయుడు... రాజధాని భూములపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించాలని విలేకర్లు కోరగా... అందుకు అచ్చెన్నాయుడు పై విధంగా సమాధానం మిచ్చారు. ఈ బడ్జెట్లో క్రీడా రంగానికి రూ. 1000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. తిరుపతి, విశాఖ, విజయవాడ నగరాల్లో అంతర్జాతీయ స్టేడియాలు నిర్మిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.