కోతకు గురైన రోడ్లను గుర్తించండి | Identify roads affected by erosion | Sakshi
Sakshi News home page

కోతకు గురైన రోడ్లను గుర్తించండి

Published Wed, Oct 1 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

కోతకు గురైన రోడ్లను గుర్తించండి

కోతకు గురైన రోడ్లను గుర్తించండి

పంచాయతీరాజ్ ఎస్‌ఈ జి.సూర్యనారాయణ
 పాతగుంటూరు: వర్షాల వల్ల కోతకు గురైన రోడ్లను గుర్తించి నివేదికలు తయారు చేయాలని పంచాయతీరాజ్ ఎస్‌ఈ జి. సూర్యనారాయణ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మంగళవారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ జిల్లాస్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఏపీ డీఆర్‌ఎంపీ వరల్డ్ బ్యాంకు ద్వారా 200 మిలియన్ డాలర్లు రోడ్ల మరమ్మతులకు మంజూరయ్యాయని పేర్కొన్నారు. వీటిని గ్రామాల్లో లింకు రోడ్లు, బీటీరోడ్ల అభివృద్ధికి ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. చెట్టు - నీరు కార్యక్రమం ద్వారా జిల్లాలోని 108 కిలో మీటర్ల పొడవున 16 రోడ్లలో మొక్కలు నాటేందుకు డ్వామా అధికారులకు నివేదికలు పంపాలని ఆదేశించారు. పంచాయతీ, మండల స్థాయి భవనాలకు నిధులు అదనంగా మంజూరయ్యాయని పేర్కొన్నారు. సమావేశంలో ఈఈలు కె.రవిబాబు, ఎన్.గోవర్థన్‌రెడ్డి, డీఈలు, ఏఈలు, జేఈలు పాల్గొన్నారు.




 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement