యథేచ్ఛగా బుసక అక్రమ తవ్వకాలు | illegal sand mining in krishna district | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా బుసక అక్రమ తవ్వకాలు

Published Thu, Aug 29 2013 1:06 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM

illegal sand mining in krishna district

పెడన రూరల్, న్యూస్‌లైన్ : మండల పరిధిలోని మడక గ్రామ పంచాయతీ ఇసుక మేటల నుంచి బుసక అక్రమ  తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. కొంత మంది బుసక మాఫీయాదారులు  సీండికేట్‌గా ఏర్పడి మైనింగ్ శాఖ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రోజుకు లక్షలాది రూపాయల విలువ చేసే బుసక ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంలో మండల రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఇందుకు కారణం మాఫియా వెనుక రాజ కీయ పెద్దల హస్తం ఉండడమేనని విమర్శలున్నాయి. ఓ బిల్టర్ మడక గ్రామంలో సహజ సిద్ధంగా ఏర్పడిన బుసక మేటలున్న 20 ఎకరాల పొలాన్ని ఇటీవల కొనుగోలు చేసి బుసక  తవ్వకాలు నిర్వహించుకునేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ మైనింగ్ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు రాకుండానే... పంట పొలాన్ని చదును చేసుకునేందుకు అనుమతులొచ్చాయని చెబుతూ బుసక తరలిస్తున్నారనే ఆరోపణ లున్నాయి.

ఈ విషయంలో రెవెన్యూ అధికారులను ప్రలోభాలకు గురి చేసి వారి అండదండలతో పగలు రాత్రి అనే తేడా లేకుండా నిత్యం వందలాది వాహనాల్లో బుసకను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే విమర్శలున్నాయి. బుసక క్వారీలో  పొక్లెయిన్ ఏర్పాటు చేసి ఒక్కో టిప్పర్‌కు  రూ.1500, ట్రాక్టర్‌కు రూ.300   నగదు  వసూలు చేస్తున్నారు. దళారులు  బుసక ఒక్కొ టీప్పర్‌ను రెండు నుంచి మూడు వేల వరకు ట్రాక్టర్‌ను రూ.600 నుంచి 800 వరకు విక్రయిస్తున్నారు. దూరాన్ని బట్టి బుసకకు రేటు నిర్ణయిస్తున్నారు.

బుసక అక్రమ తరలింపులో మండల రెవెన్యూ అధికారి కార్యాయంలోని ఓ వీఆర్‌ఏ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. సదరు వీఆర్‌ఏ ద్వారా మండల రెవెన్యూ కార్యాలయంలోని  కిందిస్థాయి అధికారి నుంచి పైస్థాయి అధికారి  వరకు  భారీగా ముడుపులు తీసుకుని వారికి సహకారం అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి.  బుసకను భవన నిర్మాణాలు చేసే ప్రాంతాలను మేరక చేసుకునేందుకు ఉపయోగిస్తున్నారు. గూడూరు మండలం తరకటూరు ప్రాంతంలో ఓ రైస్ మిల్లు నిర్మాణం కోసం వందల టిప్పర్లు తరలి వెళుతున్నాయి.

వీటితో పాటు బందరు, బంటుమిల్లి, గూడూరు, కృత్తివెన్ను గుడ్లవల్లేరు, గుడివాడ, పామర్రు, ఉయ్యూరు మండలాలకు టిప్పర్లు, ట్రాక్టర్లపై పరదాలు కప్పి బుసకను అక్రమంగా తరలిస్తున్నారు.  బుసక క్వారీ నుంచి ప్రతి రోజూ సుమారు లక్ష నుంచి  ఐదు లక్షల రూపాయల విలువ చేసే బుసక తరలిపోతున్నట్లు సమాచారం. ఈ విషయమై స్థానిక తహశీల్దార్ కొగంటి ఉమారాణిని న్యూస్‌లైన్ వివరణ కోరగా బుసక  తవ్వకాల గురించి ఎవరికీ ఎటువంటి అనుమతులు లేవని, విచారణ నిర్వహించి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. వారి నుంచి రెవెన్యూ కార్యాలయ సిబ్బందికి ముడుపులు ఏమి అందలేదని, అవన్నీ నిరాధార ఆరోపణలని ఆమె చెప్పారు.
 
చేపల చెరువుల తవ్వకాలకు రంగం సిద్ధం...
 మడకలో గ్రామంలో   బుసక దిబ్బలను చేపల చెరువులుగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మడకలో బిల్డర్ కొనుగోలు చేసిన 20 ఎకరాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన బుసక గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టలను  తరలించి ఆ ప్రాంతంలో అనధికారికంగా చేపల చెరువులను తవ్వేందుకు ప్రయత్నాలు జోరుగాసాగుతున్నాయి.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement