వరద నీటిలో యువకుడి గల్లంతు
Published Sun, Aug 18 2013 4:31 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
మిర్యాలగూడ టౌన్, న్యూస్‌లైన్ :ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో ప్రమాదవశాత్తు కాలుజారి ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన శనివారం మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని తాళ్లగడ్డకు చెందిన వర్కాల యాదగిరి, లక్ష్మిల కుమారుడు నవీన్ పేపర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం కూడా పేపర్ వేసి ఇంటికి వచ్చాడు. బ్రెష్ వేసుకొని తాళ్లగడ్డ, యాద్గార్‌పల్లి కల్వర్టు వద్దకు బహిర్భుమికి వెళ్లాడు. యాద్గార్‌పల్లి చెరువు కట్టవెంట వర్షపునీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
కల్వర్టు పైనుంచి వెళ్తున్న వరద ఉధృతిని చూసేందుకు నవీన్ కల్వర్ట్ పక్కన నిలబడి చూస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి వాగునీటిలో పడి కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న లలితమ్మ అనే మహిళ చూసి కేకలు వేసి నా ఫలితం లేకుండా పోయింది. యాద్గార్‌పల్లిలో యువకుడు గల్లంతు అయిన విషయం తెలుసుకున్న ఆర్డీఓ డి. శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దారు వేముల రమాదేవిలు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను అడిగితెలుసుకున్నారు.
గాలింపు చర్యలు చేపట్టినా..
తాళ్లగడ్డ-యాద్గార్‌పల్లి మధ్యలో గల కల్వర్టులో పడి నవీన్ గల్లంతైన విషయాన్ని తెలుసుకుని స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వరదనీటిలో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. చేతికి వచ్చిన కొడుకు గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించించాయి.
ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి : జూలకంటి
విషయం తెలుసుకుని స్థానిక ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం డివిజన్ కార్యదర్శి డబ్బీకార్ మల్లేష్, టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ దుర్గాప్రసాద్, బంటు వెంకటేశ్వర్లు ఆ ప్రాంతాన్ని సందర్శిం చారు. అనంతరం సంఘటనకు గల కారణాలను నవీన్ తల్లిదండ్రులను అడి గి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్సిగ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement