సాక్షి, విజయవాడ : ఇందిరాగాంధీ స్టేడియంలో జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని విజయవాడ సీపీ ద్వారకాతిరుమల రావు పేర్కొన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి నగరంలో ట్రాఫిక్ నిబంధనలు అమలులో ఉంటాయని, పోలీసు శాఖలోని అన్ని విభాగాల సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రోన్ కెమెరాలతో సభాప్రాంగణం పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశామని వివరించారు.
కార్యక్రమానికి వచ్చే అతిథులకు ఏ1, ఏ2, ఏ3, బి1,బి2 గా పాసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏ1, ఏ2, ఏ3, పాస్‌లు ఉన్న వారికి వాహనాల పార్కింగ్ కోసం హ్యాండ్ బాల్ మైదానం, బిషప్ హజరయ్య స్కూల్ కేటాయించామన్నారు. బి1,బి2 పాసులు ఉన్నవారికి ఏఅర్ గ్రౌండ్స్, కమాండ్ కంట్రోల్ రూమ్, అర్ ఆండ్ బీ సెల్లార్‌లో పార్కింగ్ చేయాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చే విద్యార్థులకు, తల్లిదండ్రులకు 5, 6 గేట్ల నుంచి ప్రవేశం కల్పించామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment