
రోళ్లపాడులో కనిపించిన బట్టమేక పక్షి
ప్రపంచంలోనే అరుదైన బట్టమేక పక్షి కర్నూలు జిల్లా రోళ్లపాడు అభయారణ్యంలో కనిపించింది. ఈ విషయాన్ని గురువారం.. డీఆర్వో (డివిజనల్ రేంజ్ ఆఫీసర్) లక్ష్మీనారాయణ ధ్రువీకరించారు. రోళ్లపాడు అభయారణ్య పరిధిలోని అలగనూరు పరిసర ప్రాంతంలో బట్టమేక పక్షి సంచరిస్తున్న విషయాన్ని బర్డ్ వాచర్ గమనించారు. విషయం తెలుసుకున్న ఎఫ్‌ఆర్‌వో దత్తాత్రేయ, డీఆర్వో లక్ష్మీనారాయణ.. సిబ్బందితోపాటు పక్షి సంచరిస్తున్న ప్రాంతానికి చేరుకొని బైనాక్యూలర్ సహాయంతో వీక్షించారు. ఈ ఏడాది సెప్టెంబర్ ప్రారంభంలోనే బట్టమేక పక్షి సంచరించడంతో ఎఫ్‌ఆర్‌వో ఆనందం వ్యక్తం చేశారు. రానున్న రెండు, మూడు నెలల వ్యవధిలో అధిక సంఖ్యలో బట్టమేక పక్షులు సంచరించే అవకాశం ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
– మిడుతూరు