డిప్యూటీ కలెక్టర్‌కు గాయాలు | Injuries to the deputy collector | Sakshi
Sakshi News home page

డిప్యూటీ కలెక్టర్‌కు గాయాలు

Apr 13 2016 2:44 AM | Updated on Aug 30 2018 4:07 PM

కశింకోట వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సివిల్ డిఫెన్స్ విభాగంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి. జవహార్‌లాల్ ...

సుమో టైర్ పంక్చరై ప్రమాదం
మరో నలుగురికి స్వల్పగాయాలు

 

కశింకోట: కశింకోట వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో  సివిల్ డిఫెన్స్  విభాగంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి. జవహార్‌లాల్ నెహ్రూ, మరో నలుగురు గాయపడ్డారు. కాకినాడ నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న సుమో కశింకోట ఆర్టీసీ బస్టాండ్ వద్దకు వచ్చేసరికి  ముందు టైరు పంక్చర్ అయింది. దీంతో సుమో అదుపు తప్పి జాతీయ ర హదారి డ్రైనేజీ  కాలువపై నుంచి దూసుకు వ చ్చి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది.  


విద్యుత్ స్తంభం విరిగిపోయి, సరఫరా నిలిచిపోయింది.  సుమోలో ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జవహార్‌లాల్ నెహ్రూ గాయపడగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స చేశారు. ఆయనతోపాటు ప్రయాణిస్తున్న నలుగురు స్వల్పంగా గాయపడినట్టు స్థానికులు తెలిపారు. వీరు తర్వాత వేరే కారులో   వెళ్లారు. ఆర్‌ఈసీఎస్ అధికారులు, సిబ్బంది విరిగిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి కొత్త స్తంభాన్ని ఏర్పాటుచేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మంగళవారం చర్యలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement