సాగర్‌డ్యాంను సందర్శించిన ఇంటెలిజెన్స్ బృందం | Intelligence team inspects Nagarjuna sagar project | Sakshi
Sakshi News home page

సాగర్‌డ్యాంను సందర్శించిన ఇంటెలిజెన్స్ బృందం

Published Tue, Sep 30 2014 1:43 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM

Intelligence team inspects Nagarjuna sagar project

 నాగార్జునసాగర్: దేశంలో ఉగ్రవాదుల దాడుల హెచ్చరికల నేపథ్యంలో సోమవారం ఇంటెలిజెన్స్ బృందం నాగార్జునసాగర్ డ్యాం ను సందర్శించింది. బృందం సభ్యులు మొదట గార్డ్‌రూములు, కాపలా ఉండే గార్డుల సంఖ్యను, సీసీ కెమెరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. డ్యాం భద్రతపై ఆరా తీశారు. గ్యాలరీలలోకి దిగి ఆయాప్రాంతాలను సందర్శించారు. ఎస్‌పీఎఫ్ సిబ్బందికి కావాల్సిన భద్రత సామగ్రిని, గార్డుల సంఖ్యను పెంచాలని ప్రాజెక్టు అధికారులకు సూచించినట్లు తెలిసింది. సందర్శించిన వారిలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ లక్ష్మినారాయణరెడ్డి బృందం వెంట డ్యాం ఈఈ విష్ణుప్రసాద్, ఎస్‌పీఎఫ్ అధికారులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement