కడప అర్బన్: తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీంద్రనగర్‌లో నివసిస్తున్న షేక్ మహమ్మద్ జమీర్ హుస్సేన్ (16) కడప నగరంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతూ ఈనెల 12వ తేదీ నుంచి కనిపిండం లేదు. విద్యార్థి తల్లి షేక్ ఖుర్షీదా ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం తాలూకా సీఐ ఎస్. విశ్వనాథరెడ్డి కేసు నమోదు చేశారు. విద్యార్థి తండ్రి మహమ్మద్ హుస్సేన్ జీవనాధారం కోసం గల్ఫ్ వెళ్లాడు. విద్యార్థి ఆచూకీ తెలిసిన వారు 91211 00514, 70139 90235 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment