హైదరాబాద్: పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి దూరవిద్యా కేంద్రం వారు బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మాసబ్‌ట్యాంక్ ప్రభుత్వ బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ రేణుకాదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న మహిళా ఉపాధ్యాయులు అర్హులన్నారు.
ఆసక్తి గల వారు 11, 12, 13వ తేదీలలో మాసబ్‌ట్యాంక్ ఎన్‌ఎండీసీ వద్ద ఉన్న బీఈడీ కళాశాలలో బయోడేటాతో హాజరు కావాలన్నారు. వివరాల కు 98850 24269, 80194 05275 నంబర్లలో సంప్రదించవచ్చు. దరఖాస్తు పొందుటకు www.spmvv.ac.in. వెబ్‌సైట్‌లో లాగిన్ కావచ్చు.