వసూల్‌ రాజా.. బ్యాండ్‌బాజా | Irregularities In Junior Lineman Jobs At Srikakulam | Sakshi
Sakshi News home page

వసూల్‌ రాజా.. బ్యాండ్‌బాజా

Published Wed, Sep 11 2019 11:34 AM | Last Updated on Wed, Sep 11 2019 11:34 AM

Irregularities In Junior Lineman Jobs At Srikakulam - Sakshi

సరైన నాయకత్వం.. సమర్థమైన అధికార గణం ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. ఇది వరకు ఉద్యోగ నియామకాలు అంటే దళారీ రాబందులు వాలిపోయేవి. అందినకాడికి దోచేసి పోస్టులు పంచేసేవి. కానీ కొత్త ప్రభుత్వం ముందు వారి పప్పులు ఉడకలేదు. లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ విషయంలో వసూళ్లకు పాల్పడిన వారిని ప్రభుత్వం, అధికార యంత్రాంగం కలిపి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాయి. లైన్‌మెన్‌ పోస్టులు అమ్మేద్దామని చూసిన దళారీల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయమే ఇప్పుడు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా ఉంది. 

సాక్షి, అరసవల్లి: గ్రామ సచివాలయాల పోస్టుల్లో భాగంగా ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్‌ లైన్‌మెన్లు) పోస్టుల భర్తీలో దళారీల ప్రమేయం జరగడం జిల్లాలో కలకలం రేపింది. పరీక్షల ప్రక్రియ పారదర్శకంగా ముగిసినప్పటికీ, చివరి రోజునే దళారీ వ్యవహారం బయటకు రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అప్పటికే పోల్‌ క్లైంబింగ్‌ పరీక్షల్లో పాసైన అభ్యర్థులను పక్కాగా గుర్తించి, మెరిట్‌ జాబితాలో పోస్టు ఇప్పిస్తామంటూ, వారి అవసరాలను ఆదాయ వనరులుగా మార్చుకుని రూ.లక్షల్లో వసూలు చేసినట్లుగా బయటకు పొక్కింది. సంబంధిత అభ్యర్థి బేరసారాలాడుతూ నేరుగా విద్యుత్‌ విజిలెన్స్‌ అధికారులకే చిక్కడంతో విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు చర్యలకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంక అంతా కదులు తోంది. దీంతో ఇటు దళారీలకు సహకరించిన అధికారులకు, అటు డబ్బులు ఇచ్చిన అభ్యర్థులకు తీవ్ర ఆందోళన కలుగుతోంది. 

అధికారుల పాత్రపై అనుమానాలు
దళారీ వ్యవహరంలో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. లైన్‌మెన్‌ పోస్టులిప్పిస్తామని చెప్పి లక్షల్లో టోకెన్‌ అడ్వాన్స్‌లు పొందినట్లుగా వస్తున్న వార్తలు నిజమనేలా ఓ విద్యుత్‌ యూనియన్‌ నేత వ్యవహరించిన తీరు స్పష్టం చేస్తోంది. ఈనెల 7వ తేదిన ఆమదాలవలసకు చెందిన దుర్గా ప్రసాద్‌ విజిలెన్స్‌ అధి కారులకు చిక్కడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిగా భావిస్తున్న ఆ యూనియన్‌ నేతను వెతకగా.. అప్పటికే జిల్లా కేంద్రం నుంచి పరారయ్యారు. దీంతో ఆరోపణలకు తగ్గట్టుగానే అన్ని వేళ్లు అతనివైపే చూపిస్తున్నాయి. దీనికితోడు అతనికి సంబంధించిన యూని యన్‌ నేతలెవ్వరూ ఈ విషయాన్ని ఖండించకపోవడంతో పాటు, ఈ వ్యవహారంలో తమ నాయకుడి పాత్ర లేదని చెప్పే «ధైర్యం చెయ్యలేకపోవడంతో ఆ పెద్ద యూనియన్‌ నేతే ప్రధాన నిందితుడిగా ఆయన సహచరులే అనధికారికంగా అంగీకరిస్తున్నట్లుగా సమాచారం. 

జిల్లా వ్యాప్తంగా 679 పోస్టులకు సుమారు 40 నుంచి 50 పోస్టుల వరకు అక్రమదారిలో ద క్కించుకునేందుకు స్కెచ్‌ వేసినట్లుగా పలువు రు యూనియన్‌ నేతలు చర్చించుకుంటున్నారు. దీనికి పూర్తిగా విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగుల సహకారం కూడా ఉన్నట్లుగా తెలిసింది. కార్పొరేట్‌ కార్యాలయం నుంచే అంతా ‘సర్దుకుని’ వస్తున్నారని సమాచారం ఉ న్న నేపథ్యంలో జిల్లాలో వ్యవహారంలో పలు వురు అధికారుల సహకార పాత్ర కూడా కీలకమైంది. టూటౌన్‌ సీఐ ఎస్‌.శంకరరావు ఈ అం శంపై సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇప్పటికే అదుపులో ఉన్న దుర్గాప్రసాద్‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా గోపాలరావు అనే విద్యుత్‌ శాఖ ఉద్యోగి, శ్రీధర్‌ అనే వ్యాపారులపై 420 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. దీంతో పాటు దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే ఇందులోనే అసలైన విషయాలన్నీ బయటకువస్తున్నాయి. దీంతో దళారీ గ్యాం గ్‌లో ఉన్న ఉద్యోగులకు, సహకరించిన పలు వురు అధికారులకు చెమటలు పడుతున్నాయి. పరారీలో ఉన్న గోపాలరావు సెలవును కూడా అధికారులు తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. కీలకంగా ఉన్న ఫోన్‌ డాటా వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఈ వివరాలతో మరెంత మంది కొత్త పేర్లు బయటకు వస్తాయో అన్న ఉత్కంఠ నెలకొంది.

సీరియస్‌గా సీఎండీ
తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధి లో ఉన్న ఐదు జిల్లాల్లో అంతటా ప్రశాంతంగా విద్యుత్‌ లైన్‌మెన్‌ పోస్టుల ఎంపిక ప్రక్రియలు జరిగాయి. అయితే చివర్లో స్థానిక జిల్లాలో దళా రీ వ్యవహారం బయటకురావడంపై సీఎండీ నా గలక్ష్మి సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. దీనిపై కార్పొరేట్‌ కార్యాలయం నుంచే జిల్లాలో పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం. పోల్‌ క్‌లైంబింగ్‌ పరీక్షల అనంతరం అభ్యర్థుల వివరాలను ఫోన్లో వాట్సాప్‌లో బయట ఉన్న దళా రీలకు పంపించిన అధికారులు ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు డ్యూటీ చార్టులను కూడా సీఎండీ కార్యాలయానికి తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలావుంటే ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కార్యాలయం నుంచి కూడా ఎప్పటికప్పుడు సమాచారం కోసం ఫోన్లు వస్తుండడంతో ఉన్నతా«ధికారులకు చెమట్లు పడుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement