Junior Lineman posts
-
టీఎస్ ఎస్పీడీసీఎల్లో 1,661 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో 48 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 1,553 జూనియర్ లైన్‌మన్ పోస్టుల భర్తీకి గురువారం సమగ్ర నియామక ప్రకటనలు జారీ అయ్యాయి. ఏఈ పోస్టులకు ఈ నెల 23 నుంచి వచ్చే నెల 15వరకు.. జేఎల్ఎం పోస్టులకు వచ్చే నెల 8 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. రెండు పరీక్షలకు కూడా ఏప్రిల్ 24 నుంచి ఆన్లైన్లో హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 30న రాతపరీక్ష నిర్వహించనున్నారు. గరిష్ట వయోపరిమితి జేఎల్ఎం పోస్టులకు 35 ఏళ్లు, ఏఈ పోస్టులకు 44 ఏళ్లు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతలు కలిగిన వారు ఏఈ (ఎలక్ట్రికల్) పోస్టులకు అర్హులు. జూనియర్ లైన్‌మన్ పోస్టులకు పదో తరగతితోపాటు ఎలక్ట్రికల్/వైర్మన్ ట్రేడ్లలో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఇంటర్ వొకేషనల్ కోర్సు చేసి ఉండాలి. పూర్తి వివరాలకు సంస్థ వెబ్సైట్ (https://tssouthernpower.cgg.gov.in) ను సందర్శించవచ్చని టీఎస్ ఎస్పీడీసీఎల్ ప్రకటించింది. -
టీఎస్ఎస్పీడీసీఎల్లో 1,661 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో ఖాళీగా ఉన్న 1,553 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం), 48 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు కలిపి మొత్తం 1,661 పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరాపై మంగళవారం ఆయన మింట్ కాంపౌండ్ లోని తన కార్యాలయంలో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డితో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏడాదికేడాది విద్యుత్ డిమాండ్ పెరిగిపోతోందని, ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 6,666 మెగావాట్లు ఉన్న గరిష్ట విద్యుత్ డిమాండ్ గతేడాది యాసంగిలో 14,160 మెగావాట్లకు పెరిగిందన్నారు. వచ్చే వేసవిలో 15,500 మెగావాట్లకు మించనుందని, అందుకు తగ్గట్టు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎండీలను ఆదేశించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, గృహ వినియోగదారుల పెరుగుదల, వ్యవ సాయ రంగానికి ఉచితవిద్యుత్ సరఫరాతో డిమాండ్ గణనీయంగా పెరిగిందన్నారు. -
అంగట్లో జూనియర్ లైన్‌మన్ పోస్టులు రూ.5 లక్షలకు బేరం!
సాక్షిప్రతినిధి, వరంగల్: విద్యుత్‌శాఖలో జూనియర్ లైన్‌మన్ (జేఎల్ఎం) పోస్టులు దళారులకు వరంగా మారాయి. నిరుద్యోగులను నమ్మించి డబ్బులు గుంజేందుకు గ్రూపులుగా ఏర్పడిన కొందరు వేలం పెట్టారు. టీఎస్ఎస్పీడీసీఎల్లో 1,000 జేఎల్ఎం పోస్టుల భర్తీకి వెలువడిన నోటిఫికేషన్‌ను ఆసరాగా చేసుకుని.. అందులో పనిచేస్తున్న కొందరు.. ఉన్నతాధికారుల పేర్లు చెప్పి వసూళ్లకు శ్రీకారం చుట్టారు. ఈ దళారులకు కొందరు అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు తోడయ్యారు. దరఖాస్తు చేయడం మొదలు పరీక్ష రాసి ఉద్యోగం వచ్చే వరకు అంతా తామే చూసుకుంటామని అందినకాడికి దండుకున్నారు. ఈనెల 17న జరిగిన రాత పరీక్ష సందర్భంగా పలు అవకతవకలు వెలుగుచూడగా... ఉమ్మడి వరంగల్‌కు చెందిన పలువురు బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) రంగంలోకి వరంగల్‌లో ఆరా తీస్తుండడం కలకలం రేపుతోంది. చదవండి👉🏻పెద్దరాతియుగం నాటి చిత్రాల తావు గుర్తింపు దళారులకు వరంగా నోటిఫికేషన్.. ఎస్పీడీసీఎల్లో 70 అసిస్టెంట్ ఇంజనీర్లు, 201 సబ్ ఇంజనీర్లు, 1,000 లైన్‌మన్ పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో జేఎల్ఎం కోసం మే 19 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 35 ఏళ్లలోపు ఉన్న ఉన్నవారు దరఖాస్తు చేసుకునే అర్హత ఉండగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. వెయ్యి జేఎల్ఎం పోస్టుల కోసం 35,312 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్‌లోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలతో పాటు, హనుమకొండలో నివాసం ఉండే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, సైదాపూర్, జమ్మికుంట ప్రాంతాలకు చెందిన పలువురు కూడా ఇందులో ఉన్నారు. ఎస్పీడీసీఎల్ హైదరాబాద్‌లో పని చేస్తున్న హనుమకొండకు చెందిన కొందరు ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నాయకులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు బేరం పెట్టారు. కొందరు మొత్తం.. ఇంకొందరు అడ్వాన్స్‌గా చెల్లించి.. ఈ నెల 17న రాత పరీక్షకు హాజరయ్యారు. డబ్బులు తీçసుకున్న వారు ఒప్పందం ప్రకారం రాత పరీక్షకు సహకరించకపోగా, కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. చదవండి👉🏻తీరొక్క భూములు.. చూడచక్కని అడవులు ఎస్ఓటీ అదుపులో ఐదుగురు.. వరంగల్‌లో ఆరా.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన ఏసోబు (పేరు మార్చాం) అనే వ్యక్తి కాజీపేటకు చెందిన ఎస్పీడీసీఎల్కు చెందిన వ్యక్తి ద్వారా హైదరాబాద్‌లో ఓ దళారికి రూ.1.50 లక్షలు చెల్లించాడు. ఇదంతా బోగస్ అని తెలియడంతో రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన పలువురు కూడా విద్యుత్‌శాఖలో విధులు నిర్వహిస్తున్న కొందరు అధికారులు దందాకు తెరతీశారంటూ పేర్లతో సైబరాబాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. జేఎల్ఎం పోస్టుల కోసం 35,312 మందిలో.. ఉమ్మడి జిల్లా నుంచి నాన్‌లోకల్ కోటా కింద దరఖాస్తు చేసుకున్నవారు సుమారు నాలుగు వేల మందికి పైగా ఉన్నట్లు అంచనా. ఇందులో దళారులను నమ్మి మోసపోయిన చాలా మంది పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఇదే కేసులో మలక్‌పేట ఏడీలు సైదులు, ఫిరోజ్, నిత్యలు, లైన్మన్లు శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు శనివారం ఉమ్మడి వరంగల్లోనూ ఆరా తీశారు. హనుమకొండ, జనగామ, హుజూరాబాద్ ప్రాంతాల నుంచి ఫిర్యాదు చేసిన వారిని పిలిచి మాట్లాడి వివరాలు సేకరించడం చర్చనీయాంశమవుతోంది. చదవండి👉🏻క్లౌడ్ బరస్ట్, పోలవరం ఎత్తు టీఆర్ఎస్కు కొత్త ఆయుధాలా! -
TSSPDCL: జేఎల్‌ఎంల పోస్టులకు పదేళ్ల ‘వయో’ సడలింపు లేదు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) భర్తీ చేయనున్న జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులకు 10 ఏళ్ల గరిష్ట వయోపరి మితి సడలింపును వర్తింపజేయడం లేదు. విద్యుత్ స్తంభాలను ఎక్కి అత్యంత ప్రమాదకర పరిస్థితిలో విధులు నిర్వహించే జూనియర్ లైన్మెన్కు శారీరక దారుఢ్యం అత్యంత ఆవశ్యకమని, అందువల్ల ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి సడలింపు ఇవ్వరాదని టీఎస్ఎస్పీడీసీఎల్ నిర్ణయించింది. 1,000 జేఎల్ఎం, 201 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 70 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి సంస్థ ఈ నెల 9న సంక్షిప్త ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ పోస్టుల కు మాత్రం 10 ఏళ్ల గరిష్ట వయోపరి మితి సడలింపును వర్తింపజేయనున్నట్టు సంస్థ ఉన్నతాధికారవర్గాలు తెలిపాయి. జేఎల్ఎం, సబ్ ఇంజనీర్ జిల్లా స్థాయి పోస్టులే కొత్త జోనల్ విధానం ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. జేఎల్ఎం, సబ్ ఇంజనీర్ పోస్టులను జిల్లా స్థాయి పోస్టులుగా వర్గీకరించి భర్తీ చేస్తున్నారు. దీంతో ఆయా జిల్లాల స్థానికత గల అభ్యర్థులకే 95 శాతం పోస్టులు దక్కనున్నాయి. ఐటీఐ (ఎలక్ట్రికల్)తో పాటు అప్రెంటిస్ పూర్తి చేసిన అభ్యర్థులు జేఎల్ఎం పోస్టులకు అర్హులు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన వారు సబ్ ఇంజనీర్ పోస్టులకు అర్హులు కానున్నారు. డిస్కం స్థాయి పోస్టులుగా ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికే షన్ వెలువడింది. గురువారం నుంచి వచ్చే నెల 3 వరకు దరఖాస్తులను స్వీకరించను న్నారు. జూలై 17న రాత పరీక్ష జరగనుంది. ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండి 18–44 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో ఐదేళ్లు, శారీర క వికలాంగులకు మరో 10 ఏళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు వర్తించనుంది. ఏఈ పోస్టుల ను కొత్త జోనల్ విధా నం కింద టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలోని పోస్టులుగా విభ జించారు. సంస్థ పరిధిలోని 16 జిల్లాల అభ్యర్థులు 95% పోస్టుల కోసం పోటీపడడానికి అర్హులు. ఏఈ పోస్టుల నోటిఫికేషన్‌ను సంస్థ వెబ్సైట్ https://tssouthernpower.cgg.gov.in లో చూడవచ్చు. జేఎల్ఎం, సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్‌లో లైన్మెన్ ఉద్యోగాలు
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీసీపీడీసీఎల్).. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా గ్రామ/వార్డు సెక్రటేరియట్స్‌లో ఉన్న 86 ఎనర్జీ అసిస్టెంట్(జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. రాత పరీక్ష, పోల్ క్లైబింగ్, మీటర్ రీడింగ్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు మే 3వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. పదోతరగతితోపాటు ఎలక్ట్రికల్/వైర్‌మెన్ ట్రేడ్‌ల్లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్(ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లియెన్సెస్ అండ్ రివైండింగ్ /ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్/ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్)లో ఉత్తీర్ణత సాధించాలి. వయసు: 31.01.2021 నాటికి 18–35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం ► ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ టెస్ట్(పోల్/టవర్ క్లైబింగ్ టెస్ట్), మీటర్ రీడింగ్ టెస్టుల ద్వారా ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష ► పరీక్ష మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఐటీఐలో సంబంధిత ట్రేడ్ నుంచి ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షల్లో జనరల్ అభ్యర్థులు కనీసం 40శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు కనీసం 35శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు సాధించాలి. పోల్ క్లైబింగ్ ► పోల్ క్లైబింగ్ టెస్ట్‌లో భాగంగా.. 15 నిమిషాల వ్యవధిలో పోల్ ఎక్కి దిగాల్సి ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించి.. పోల్ క్లైబింగ్‌లో విఫలమైతే ఈ పోస్టులకు అనర్హులుగా ప్రకటిస్తారు. మీటర్ రీడింగ్ ► రాత పరీక్షతోపాటు పోల్‌క్లైబింగ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో మీటర్ రీడింగ్ పరీక్షలకు పిలుస్తారు. ఎంపిక తర్వాత ► ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు నెలకు రూ.15000 చొప్పున వేతనంగా అందిస్తారు. వీరు గ్రామ పంచాయతీ/వార్డులలో ఏర్పాటు చేసిన సెక్రటేరియట్స్/వార్డు సెక్రటేరియట్స్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు ► ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.700, అలాగే ఎస్సీ/ఎస్టీ వారు రూ.350 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి: 03.05.2021 ► వెబ్సైట్: www.apcpdcl.in టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్: జూనియర్ అసిస్టెంట్ కొలువులు -
మరో ‘ఛీ’టింగ్ కేసు
సాక్షి, అరసవల్లి: జూనియర్ లైన్‌మన్ (జేఎల్ఎం) నియామకాల్లో దళారీ అవతారమెత్తిన ఈపీడీసీఎల్ సీనియర్ అసిస్టెంట్, 1104 విద్యుత్ ఉద్యోగుల యూనియన్ రీజనల్ కార్యదర్శి ఎం.వి.గోపాలరావు (గోపి) చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయన అవినీతిపై మరో కేసు నమోదైంది. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు ఇప్పిస్తానంటూ 2016లో తన నుంచి అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు తీసుకున్నాడని, ఇప్పటివరకు ఉద్యోగం రాలేదని, ఆఖరికి అడ్వాన్స్ డబ్బులు కూడా ఇవ్వడం లేదంటూ బుడితి గ్రామానికి చెందిన కళ్లేపల్లి మల్లేసు అనే యువకుడు టూటౌన్లో ఫిర్యాదు చేశారు. ఈపోస్టు కోసం గోపికి, మల్లేసుకు మధ్య రూ.5 లక్షలకు బేరం కుదరగా, ముందుగా రూ.2 లక్షలు ఇచ్చినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితమే ఈ ఫిర్యాదు చేరడంతో.. టూ టౌన్ పోలీసులు గోపాలరావుపై 420 సెక్షన్ కింద మరో చీటింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈనెల 7న ఆమదాలవలసకు చెందిన జి.దుర్గాప్రసాద్ అనే అభ్యర్థితో జేఎల్ఎం పోస్టు ఇప్పిస్తానని బేరసారాలు సాగిస్తున్నారని గోపీతోపాటు వ్యాపారి శ్రీధర్లపై చీటింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇది జరిగి నేటికి పది రోజులు అవుతున్నా... ఇంతవరకు పోలీసుల చర్యల్లో పురోగతి కన్పించలేదు. యూనియన్ నేత గోపితో పాటు శ్రీధర్ ఆచూకీని కూడా పోలీసులు కనిపెట్టలేదు. దీంతో దళారీ వ్యవహారం కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉండిపోయింది. ఇదిలావుంటే సివిల్ పోలీసుల నుంచి ఈ దళారీ వ్యవహారం కేసును సీసీఎస్ (క్రైం బ్యాంచ్) పోలీసులకు బదిలీ అయ్యింది. అయినప్పటికీ ఇంతవరకు దర్యాప్తు వ్యవహారం తేలలేదు. అభ్యర్థి దుర్గాప్రసాద్ ఫోన్ డేటా బయటపడితే.. మరింత మంది గ్యాంగ్ సభ్యుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఇదిలావుంటే జిల్లా కేంద్రంతోపాటు నరసన్నపేట, ఆమదాలవలస, టెక్కలి, రాజాం, ఎచ్చెర్ల, భామిని, పలాస తదితర ప్రాంతాల్లో కూడా దళారీ గ్యాంగ్ తమ హవాను కొనసాగించారని తెలు స్తోంది. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న గోపీపై కేసులు నమోదై.. మిగిలిన వారి పేర్లు బయటకు వచ్చే అవకాశాలుండడంతో వారందరిలో ఆందోళన నెలకొంది. ఇదిలావుంటే ఈ దళారీ వ్యవహారంపై క్షేత్ర స్థాయి నుంచి దర్యాప్తు ప్రారంభించాల్సిందిగా ఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి... విజిలెన్స్ జేఎండీ తదితర ఉన్నతాధికారులకు సూచించారు. దీంతో ఈ కేసును శాఖాపరంగా సీరియస్‌గా పరిగణిస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్ ఎం.వి.గోపాలరావును విధుల నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 1104 సంఘ రీజనల్ సెక్రటరీగా రాంప్రసాద్: విద్యుత్ లైన్‌మన్ పోస్టుల ఎంపికలో దళారీ వ్యవహారం నడిపిస్తున్నట్లు ప్రధాన ఆరోపణలున్న ఎం.వి.గోపాలరావు (గోపి)ని 1104 విద్యుత్ ఉద్యోగుల సంఘం నుంచి తాత్కాలికంగా తప్పిస్తూ 1104 యూనియన్ రాష్ట్ర సం ఘ అధ్యక్షుడు వి.ఎస్.ఆర్.కె.గణపతి కీలక నిర్ణయం ప్రకటించారు. ఈమేరకు సోమవారం విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రీజనల్ సెక్రటరీగా ఉన్న గోపాలరావును తాత్కాలికంగా తప్పించేలా నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ స్థానాల్లో అడహక్ కమిటీని నియమించారు. ఈప్రకారం జిల్లాలో 1104 సంఘ రీజనల్ అధ్యక్షుడిగా ఎన్.లోకేష్, రీజనల్ కార్యదర్శిగా ఎ.వి.రాంప్రసాద్‌లను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు గణపతి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 20లోగా రీజనల్ సంఘానికి కొత్త సభ్యుల నియామకాలకు ఎన్నికలను నిర్వహించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాలంటూ గణపతి సూచించా రు. అంతవరకు అడ్‌హక్ కమిటీ సభ్యులే సంఘ బాధ్యతలు నిర్వర్తించాల్సి వుంటుందని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి సుమారు 40 మంది వరకు యూనియన్ ప్రతినిధులు హాజరయ్యారు. -
‘షాక్’ ట్రీట్మెంట్.. సస్పెన్షన్
సాక్షి, అరసవల్లి: ‘పవర్’ ఫుల్‌గా వేటు పడింది... నిందితులకు ‘షాక్’ ట్రీట్మెంట్ ప్రారంభమైంది. గ్రామ సచివాలయ పోస్టుల్లో అక్రమాలకు పాల్పడితే సహించబోమని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చెప్పిన విధంగానే... అలాంటి వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలకు దిగుతున్నారు. జిల్లాలో విద్యుత్ లైన్‌మన్ (జేఎల్ఎం) పోస్టుల వ్యవహారంలో చక్రం తిప్పేందుకు యత్నించిన దళారీ గ్యాంగ్‌లో ప్రధాన వ్యక్తిగా భావిస్తున్న వ్యక్తిపై తొలి వేటు పడింది. నిరుద్యోగుల నుంచి వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక సర్కిల్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్, 1104 విద్యుత్ యూనియన్ రీజనల్ సెక్రటరీ ఎం.వి.గోపాలరావు (గోపి)పై ఉన్నతాధికారులు గురువారం చర్యలకు ఉపక్రమించారు. ఈపీడీసీఎల్ సంస్థ పరువుకు సంబంధించిన విషయంగా దీన్ని సీరియస్‌గా భావించిన కార్పొరేట్ ఉన్నతాధికారులు నిందితుడిగా భావిస్తున్న గోపాలరావును సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. గురువారం విశాఖపట్నంలో కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమీక్షలో సీఎండీ ఎస్.నాగలక్ష్మి ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గురువారం సాయంత్రం నుంచే సస్పెన్షన్ అమల్లోకి వచ్చేలా సర్కిల్ ఎస్ఈ ఎన్.రమేష్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈపీడీసీఎల్ అధికారుల ఫిర్యాదు మేరకు నమోదైన క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్నందున గోపాలరావును సస్పెండ్ చేస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలావుంటే ఈనెల 7వ తేదీ నుంచే.. గోపాలరావు పరారీలో ఉన్నారు. సర్కిల్ కార్యాలయానికి సెలవు దరఖాస్తును ఇప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఎస్ఈ రమేష్ దీన్ని తిరస్కరించిన సంగతి విదితమే. తాజా పరిణామాలతో డబ్బులిచ్చిన అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోగా.. దళారీ గ్యాంగ్‌లో సహకార పాత్ర పోషించిన పలువురు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. క్రిమినల్ కేసుగా నమోదు చేసిన సీసీఎస్ (క్రైం బ్రాంచ్) పోలీసులు దీన్ని చాలెంజ్‌గా తీసుకుని నిందితులుగా భావిస్తున్న ఎం.వి.గోపాలరావు, శ్రీధర్‌లను పట్టుకునేందుకు చర్యలను వేగవంతం చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దర్యాప్తు ప్రక్రియ కూడా మరింత వేగంగా పరుగులు తీసే అవకాశాలు కన్పిస్తున్నాయి. సమీక్షలో సీఎండీ సీరియస్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) కార్పొరేట్ కార్యాలయంలో గురువారం సీఎండీ ఎస్.నాగలక్ష్మి నిర్వహించిన ప్రత్యేక సమీక్ష వాడీవేడిగా సాగింది. డిస్కం పరిధిలోని ఐదు జిల్లాల్లో జేఎల్ఎం పోస్టుల ఎంపిక పరీక్షలన్నీ ప్రశాంతంగా జరిగినప్పటికీ, శ్రీకాకుళం జిల్లాలో దళారీ వ్యవహారంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్ అధికారులు గుర్తించిన సమాచారం మేరకు మరింత లోతుగా దర్యాప్తు సాగాలని ఆదేశించారు. ఇదిలావుంటే విద్యుత్ శాఖకు చెందిన ఉద్యోగే ఇలాంటి దళారీ వ్యవహారాన్ని నడిపించడంపై వస్తున్న ఆరోపణలపై ఆమె సీరియస్ అయ్యారు. దళారీ గ్యాంగ్‌లో ఒకరుగా ఆరోపణలున్న సీనియర్ అసిస్టెంట్ ఎం.వి.గోపాలరావుకు సహకరించిన సిబ్బందిని కూడా గుర్తించాలని, ముందుగా గోపాలరావును విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఆమె సీరియస్‌గా ఆదేశించారు. దీనిపై సర్కిల్ ఎస్ఈ ఎన్.రమేష్ స్పందిస్తూ... పరీక్షలన్నీ పారదర్శకంగానే నిర్వహించామని, అయితే వర్షం కారణంగా కొంతమేరకు ఆలస్యమయ్యాయన్నారు. దీంతో రిజర్వ్ డేట్లో కూడా కొందరికి పరీక్షలు పెట్టి ప్రక్రియను ముగించామన్నారు. జిల్లాలో మొత్తం 679 జేఎల్ఎం పోస్టులకు 986 మంది అభ్యర్థులు మూడు పరీక్షల్లో అర్హులుగా నిలిచారని వివరించారు. -
వసూల్ రాజా.. బ్యాండ్‌బాజా
సరైన నాయకత్వం.. సమర్థమైన అధికార గణం ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. ఇది వరకు ఉద్యోగ నియామకాలు అంటే దళారీ రాబందులు వాలిపోయేవి. అందినకాడికి దోచేసి పోస్టులు పంచేసేవి. కానీ కొత్త ప్రభుత్వం ముందు వారి పప్పులు ఉడకలేదు. లైన్మెన్ పోస్టుల భర్తీ విషయంలో వసూళ్లకు పాల్పడిన వారిని ప్రభుత్వం, అధికార యంత్రాంగం కలిపి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాయి. లైన్మెన్ పోస్టులు అమ్మేద్దామని చూసిన దళారీల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయమే ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా ఉంది. సాక్షి, అరసవల్లి: గ్రామ సచివాలయాల పోస్టుల్లో భాగంగా ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్మెన్లు) పోస్టుల భర్తీలో దళారీల ప్రమేయం జరగడం జిల్లాలో కలకలం రేపింది. పరీక్షల ప్రక్రియ పారదర్శకంగా ముగిసినప్పటికీ, చివరి రోజునే దళారీ వ్యవహారం బయటకు రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అప్పటికే పోల్ క్లైంబింగ్ పరీక్షల్లో పాసైన అభ్యర్థులను పక్కాగా గుర్తించి, మెరిట్ జాబితాలో పోస్టు ఇప్పిస్తామంటూ, వారి అవసరాలను ఆదాయ వనరులుగా మార్చుకుని రూ.లక్షల్లో వసూలు చేసినట్లుగా బయటకు పొక్కింది. సంబంధిత అభ్యర్థి బేరసారాలాడుతూ నేరుగా విద్యుత్ విజిలెన్స్ అధికారులకే చిక్కడంతో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చర్యలకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంక అంతా కదులు తోంది. దీంతో ఇటు దళారీలకు సహకరించిన అధికారులకు, అటు డబ్బులు ఇచ్చిన అభ్యర్థులకు తీవ్ర ఆందోళన కలుగుతోంది. అధికారుల పాత్రపై అనుమానాలు దళారీ వ్యవహరంలో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. లైన్మెన్ పోస్టులిప్పిస్తామని చెప్పి లక్షల్లో టోకెన్ అడ్వాన్స్‌లు పొందినట్లుగా వస్తున్న వార్తలు నిజమనేలా ఓ విద్యుత్ యూనియన్ నేత వ్యవహరించిన తీరు స్పష్టం చేస్తోంది. ఈనెల 7వ తేదిన ఆమదాలవలసకు చెందిన దుర్గా ప్రసాద్ విజిలెన్స్ అధి కారులకు చిక్కడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిగా భావిస్తున్న ఆ యూనియన్ నేతను వెతకగా.. అప్పటికే జిల్లా కేంద్రం నుంచి పరారయ్యారు. దీంతో ఆరోపణలకు తగ్గట్టుగానే అన్ని వేళ్లు అతనివైపే చూపిస్తున్నాయి. దీనికితోడు అతనికి సంబంధించిన యూని యన్ నేతలెవ్వరూ ఈ విషయాన్ని ఖండించకపోవడంతో పాటు, ఈ వ్యవహారంలో తమ నాయకుడి పాత్ర లేదని చెప్పే «ధైర్యం చెయ్యలేకపోవడంతో ఆ పెద్ద యూనియన్ నేతే ప్రధాన నిందితుడిగా ఆయన సహచరులే అనధికారికంగా అంగీకరిస్తున్నట్లుగా సమాచారం. జిల్లా వ్యాప్తంగా 679 పోస్టులకు సుమారు 40 నుంచి 50 పోస్టుల వరకు అక్రమదారిలో ద క్కించుకునేందుకు స్కెచ్ వేసినట్లుగా పలువు రు యూనియన్ నేతలు చర్చించుకుంటున్నారు. దీనికి పూర్తిగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగుల సహకారం కూడా ఉన్నట్లుగా తెలిసింది. కార్పొరేట్ కార్యాలయం నుంచే అంతా ‘సర్దుకుని’ వస్తున్నారని సమాచారం ఉ న్న నేపథ్యంలో జిల్లాలో వ్యవహారంలో పలు వురు అధికారుల సహకార పాత్ర కూడా కీలకమైంది. టూటౌన్ సీఐ ఎస్.శంకరరావు ఈ అం శంపై సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అదుపులో ఉన్న దుర్గాప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా గోపాలరావు అనే విద్యుత్ శాఖ ఉద్యోగి, శ్రీధర్ అనే వ్యాపారులపై 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దీంతో పాటు దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే ఇందులోనే అసలైన విషయాలన్నీ బయటకువస్తున్నాయి. దీంతో దళారీ గ్యాం గ్లో ఉన్న ఉద్యోగులకు, సహకరించిన పలు వురు అధికారులకు చెమటలు పడుతున్నాయి. పరారీలో ఉన్న గోపాలరావు సెలవును కూడా అధికారులు తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. కీలకంగా ఉన్న ఫోన్ డాటా వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఈ వివరాలతో మరెంత మంది కొత్త పేర్లు బయటకు వస్తాయో అన్న ఉత్కంఠ నెలకొంది. సీరియస్‌గా సీఎండీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధి లో ఉన్న ఐదు జిల్లాల్లో అంతటా ప్రశాంతంగా విద్యుత్ లైన్మెన్ పోస్టుల ఎంపిక ప్రక్రియలు జరిగాయి. అయితే చివర్లో స్థానిక జిల్లాలో దళా రీ వ్యవహారం బయటకురావడంపై సీఎండీ నా గలక్ష్మి సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. దీనిపై కార్పొరేట్ కార్యాలయం నుంచే జిల్లాలో పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం. పోల్ క్లైంబింగ్ పరీక్షల అనంతరం అభ్యర్థుల వివరాలను ఫోన్లో వాట్సాప్‌లో బయట ఉన్న దళా రీలకు పంపించిన అధికారులు ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు డ్యూటీ చార్టులను కూడా సీఎండీ కార్యాలయానికి తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలావుంటే ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కార్యాలయం నుంచి కూడా ఎప్పటికప్పుడు సమాచారం కోసం ఫోన్లు వస్తుండడంతో ఉన్నతా«ధికారులకు చెమట్లు పడుతున్నాయి. -
స్తంభం ఎక్కేద్దాం... కొలువు కొట్టేద్దాం..
సాక్షి, విజయనగరం: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొలువుల జాతర కొనసాగుతోంది. అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న గ్రామ సచివాలయాల వ్యవస్థలో విద్యుత్ శాఖ తరఫున సేవలందించే జూనియర్ లైన్మెన్ల నియామక ప్రక్రియ నిఘా నీడలో మంగళవా రం ప్రారంభమైంది. విజయనగరం దాసన్నపేట విద్యుత్ భవనం ప్రాంగణంలో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ వై.విష్ణు ఆధ్వర్యంలో ప్రారంభమైన ఎంపికల్లో మొదటి రోజు 92 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 528 పోస్టుల భర్తీకి నిర్వహిస్తోన్న ఎంపికలకు 1575 మందికి విద్యుత్ శాఖ అధికారులు కాల్ లెటర్లు పంపించారు. ఇందులో మొదటి రోజు 316 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా... 224 మంది మాత్ర మే హాజరయ్యారు. ఎంపికలకు వచ్చిన అభ్యర్థులకు ముందుగా పది, ఐటీఐ, ఇతర అర్హత ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నారు. అనంతరం 8 మీటర్ల విద్యుత్ స్తంభం ఎక్కడం, మీటర్ రీడిం గ్, సైక్లింగ్ అంశాల్లో అభ్యర్థి వ్యక్తిగతల సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. 5 బ్యాచ్‌లుగా నిర్వహించిన ఎంపికల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. పోలీసు బందో బస్తు నియమించారు. ఈ ఎంపికల్లో అధిక సంఖ్యలో అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనలో వెనుదిరగగా.. మరికొందరు స్తంభం ఎక్కడంలో విఫలమయ్యారు. పూర్తి పారదర్శకంగా, ఎటువంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహించాలన్న సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎంపిక ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరణ చేయగా... విశాఖ కార్పొరేట్ కార్యాలయానికి చెందిన ఏపీఈపీడీసీఎల్ సీజీఎం పీవీ సత్యనారాయణ, డీజీఎం విజయకుమారిలు దగ్గరుండి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. అలవాటు లేకుండానే స్తంభం ఎక్కి... విద్యుత్ భవనం ఆవరణలో నిర్వహించిన జూనియర్లైన్మన్ ఎంపికల కోసం విద్యుత్ శాఖ అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. ఎంపికల్లో కీలకమైన స్తంభం ఎక్కడంలో ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా ముందుస్తు భధ్రతాచర్యలు చేపట్టారు. స్తంభం దిగువ భాగంలో రెండు అడుగుల ఎత్తులో ఇసుక, రంపం పొట్టు వేయడంతో పాటు అభ్యర్థి జారి పడిపోతే పట్టుకునేందుకు వలలు ఏర్పాటు చేశారు. అభ్యర్థి స్తంభం మధ్యలోనే ఉండిపోతే కిందకు దించేందుకు నిచ్చెనెలు సిద్ధం చేశారు. ఈప్రక్రియను ఐదుగురు డివిజన్‌స్థాయి ఇంజినీరింగ్ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే, చాలా మంది అభ్యర్థులు ఉద్యోగం ఆశతో తమకు అలవాటు లేకుండానే స్తంభం ఎక్కి పాట్లు పడ్డారు. టెస్ట్ కోసం పోల్ ఎక్కిన దుర్గా ప్రసాద్ అనే అభ్యర్థి కాలు జారీ పోల్ మీద నుంచి కింద పడిపోయాడు. సుమారు 8 మీటర్ల ఉండే పోల్ ను అభ్యర్థులు ఎక్కాల్సి ఉంటుంది. అదే క్రమంలో పోల్ ఎక్కుతున్న నెల్లిమర్ల జరజాపుపేటకు చెందిన దుర్గా ప్రసాద్ 6 మీటర్ల ఎత్తులో వెళ్లేసరికి ఒక్కసారిగా చేతులు జారీ కింద పడిపోయాడు. నడుముకి గాయమైంది. వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు అభ్యర్థిని అంబులెన్స్‌లో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. స్తంభం ఎక్కడం వచ్చి ఉండాలి.. ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో 528 జేఎల్ఎం పోస్టుల నియామకాలకు సంబంధించి నిర్వహిస్తోన్న ఎంపికల్లో అభ్యర్థులకు తప్పనిసరిగా స్తంభం ఎక్కడం వచ్చి ఉండాలి. సామర్థ్యం లేనివారు ఎంపికలకు హాజరుకాకపోవడం మంచిది. కోరుండి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు. ఐదురోజుల పాటు జరిగే ఎంపికలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తాం. వీడియో చిత్రీకరణ జరుగుతుంది. కార్పొరేట్ కార్యాలయం నుంచి వచ్చిన ఉన్నతాధికారులు ఎంపికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. బుధవారం నుంచి ఉదయం 8 గంటల నుంచే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమవుతుంది. – యాగంటి విష్ణు, ఎస్ఈ -
లైన్‌కట్టిన నకిలీగాళ్లు
మూడో విడత స్తంభం ఎక్కే పరీక్షలు గురువారం ఆదిలాబాద్ ఎస్ఈ కార్యాలయంలో నిర్వహించారు. ఈ పరీక్షలో మరో నకిలీ అభ్యర్థి స్తంభం ఎక్కే ముందే అధికారులు పట్టుకున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం న్యూలోలం గ్రామానికి చెందిన బొడ్డు సహేందర్ కోసం అదే గ్రామానికి చెందిన గురుపెల్లి విజయ్ స్తంభం పరీక్షలో పాల్గొనేందుకు వచ్చి దొరికిపోయాడు. ఈ బొడ్డు సహేందర్‌కు గురుపెల్లి విజయ్ దగ్గరి సంబంధీకుడు కావడం గమనార్హం. అయితే గురుపెల్లి విజయ్ న్యూలోలం గ్రామంలో ప్రైవేట్ ఎలక్ట్రీషన్‌గా పనిచేస్తాడు. గ్రామంలో స్తంభాలు ఎక్కడం, దిగడం వంటి పనులు చేపట్టడం ద్వారా విద్యుత్‌శాఖతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. ఇక్కడ తన బావమరిది కోసం స్తంభం ఎక్కేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. సాక్షి, ఆదిలాబాద్ : విద్యుత్‌శాఖలో జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల నియామక ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలకు ఈ రెండు కేసులు అద్దం పడుతున్నాయి. విద్యుత్‌శాఖతో సంబంధాలు ఉన్న వారే ఎ లాంటి భయం, సంకోచం లేకుండా స్తం భం ఎక్కే పరీక్షల్లో పాల్గొనేందుకు వస్తున్నా రు. వీడియో చిత్రీకరణ జరుగుతుందని తెలి సినా వెనుకంజ వేయకుండా వస్తున్నారంటేనే వారి వెనుక ఎవరో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జేఎల్ఎం నియామకాల్లో భాగంగా మూడో విడత స్తంభం ఎక్కే పరీక్షలను గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఈ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. వరంగల్ నుంచి వచ్చిన సీజీఎం పరిశీలకులుగా, ఆదిలాబాద్ ఎస్ఈ ఉత్తం జాడే సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఈ నియామకాలు జరుగుతున్నాయి. మొదటి కేసులో జాదవ్ శ్రావణ్‌కుమార్‌ను సెలక్షన్ కమిటీ పట్టుకున్నదిలేదు. అతనికి బదులు మరొక గుర్తు తెలియని వ్యక్తి స్తంభం ఎక్కే పరీక్షలో పాల్గొని వెళ్లిపోయిన తర్వాత మిగతా అభ్యర్థుల ఫిర్యాదుతో సెలక్షన్ కమిటీలో కదలిక వచ్చి పోలీసు ఫిర్యాదు చేశారు. ఇక్కడ సెలక్షన్ కమిటీ చేసిందేమిలేదు. దీనిపై ‘సాక్షి’లో కథనాలు రావడంతో సెలక్షన్ కమిటీ తీరుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గత్యంతరం లేని పరిస్థితిలో ఒక్క కేసైనా పట్టుకోవడం ద్వారా నకిలీలను ప్రోత్సహించమని చెప్పడానికి ఈ ప్రయత్నం చేశారనే విమర్శలూ లేకపోలేదు. మంచి డిమాండ్.. ఉమ్మడి జిల్లాలో 439 జేఎల్ఎం పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీటికి మంచి డిమాండ్ ఉండడంతో విద్యుత్‌శాఖలోని కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా గతంలో కాంట్రాక్ట్ పద్ధతిలో జేఎల్ఎం పోస్టులను భర్తీ చేసినప్పటికీ ప్రస్తుతం రెగ్యులర్ పోస్టులు భర్తీ చేస్తుండటంతో పలువురు ఈ పోస్టులపై కన్నేశారు. కొత్తగా నియమితులయ్యే జూనియర్ లైన్మెన్కు అలవెన్సులతో కలుపుకొని రూ.31వేలకుపైగా జీతం ఉంది. బేసిక్ పే రూ.24వేలకుపైగా ఉండటం గమనార్హం. ప్రభుత్వ కొలువు కావడం, మంచిజీతం ఉండడంతో విద్యుత్‌శాఖతో ఏదో రీతిన సంబంధం ఉన్నవారు దానిని సొమ్ము చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో పలువురు అభ్యర్థులు ఈ పోస్టును దక్కించుకునేందుకు అడ్డదారులకు దిగుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఓ అధికా>రి కొన్ని పోస్టులకు సంబంధించి అభ్యర్థుల వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. సెలక్షన్ కమిటీపై ఆరోపణలు వ్యక్తం కావడంతో ఏదో ఒక కేసు చేసి తాము అంతా సవ్యంగా చేస్తున్నామని నిరూపించుకునే యత్నం చేశారన్న విమర్శలు లేకపోలేదు. గురువారం 88 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించాల్సి ఉండగా, 78 మంది హాజరైనట్లు అధికారులు చెబుతున్నారు. 9 మంది గైర్హాజరయ్యారు. ఒకరికి బదులు నకిలీ వ్యక్తి హాజరుకావడంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విద్యుత్‌శాఖ ఎస్ఈ ఉత్తం జాడే ‘సాక్షి’కి తెలిపారు. ఈ విషయంలో సాక్షి వన్‌టౌన్ సీఐ సురేశ్‌ను వివరణ కోరగా విద్యుత్‌శాఖ నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని, దీంతో ఎలాంటి కేసు నమోదు చేయలేదని చెప్పారు. -
జూనియర్ లైన్మెన్ నియామకమెప్పుడో..?
విజయనగరం విద్యుత్ విభాగం, న్యూస్‌లైన్ : ధనార్జనే ధ్యేయంగా సర్ధుబాటు చార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల జేబుల గుళ్ల చేస్తున్న సర్కారు వారికి అందించే సేవల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రధానంగా క్షేత్ర స్థాయిలో చిన్నపాటి సమస్యలను పరిష్కరించడానికి కూడా సిబ్బంది లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నా రు. ప్రైవేటు వ్యక్తులతో మరమ్మతులు చేయిం చుకుని చేతి చమురు వదిలించుకుంటున్నారు. భర్తీకాని జూనియర్ లైన్‌మన్ పోస్టులు ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో జూనియర్ లైన్మెన్ల కొరత ఎక్కువగా ఉంది. క్షేత్ర స్థాయిలో వినియోగదారులకు సేవలందించాల్సిన ఉద్యోగాల నియామకాలపై ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి సబ్స్టేషన్ల ప్రాంతాల వారీగా ఉండే లైన్మెన్ల పరిధిలో పని చేసే జూనియర్ లైన్మెన్ ఆ ప్రాంతంలో ఏ వినియోగదారునికి సమస్య వచ్చినా పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు, ఇళ్లల్లో మీటర్లకు ఫ్యూజులు వేయడం, తదితర పనులు చేస్తుంటారు. ఇంతటి క్రియాశీలకమైన జేఎల్ఎం పోస్టులను 1995 తర్వాత ఇంతవరకు నియమించలేదని విద్యుత్ శాఖాధికారులే చెబుతున్నారు. దీంతో సిబ్బం ది లేమి స్పష్టంగా కనిపిస్తోంది. విద్యుత్‌శాఖ నిబంధనల ప్రకా రం ప్రతి 800 విద్యుత్ సర్వీసులకు ఒక జేఎల్ఎంను నియమించాల్సి ఉంటుంది. 1995 సంవత్సరంలో అప్పటిసర్వీసు లకు అనుగుణంగా జిల్లా వ్యా ప్తంగా 300 మంది జేఎల్‌ఎంలను నియమిం చారు. కాలక్రమంలో పలువురు జేఎల్ఎంలు ఉద్యోగవిరమణ పొంద గా... మరికొందరు పదోన్నతులు పొందారు. ప్రస్తుతం అధికారిక లెక్క ల ప్రకారం జిల్లాలో 136 మంది జేఎల్ఎంలు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇన్ని సంవత్సరాల కాలవ్యవధిలో విద్యుత్ సర్వీసుల సంఖ్య గణనీయంగా పెరి గింది. విద్యుత్‌శాఖ విజయనగరం, బొబ్బిలి ప్రాంతాలకు చెందిన డీఈలు అందించిన సమాచారం మేరకు రెండు ప్రాంతాల్లో కలిపి నాలుగు లక్షల 46 వేల విద్యుత్ సర్వీసులున్నాయి. పెరిగిన సర్వీస్‌ల సంఖ్యను పరిశీలిస్తే నిబంధనల ప్రకారం ప్రతి 800 సర్వీసులకు ఒక జేఎల్ఎం చొప్పున మొత్తం 580 మంది ఉండాలి. అయితే ప్రస్తుతం 136 మంది మాత్రమే అరకొర సేవలందిస్తున్నారు. సిబ్బంది లేకపోవడంతో విని యోగదారుల జేబులు గుళ్లవుతున్నాయి. చిన్న,చిన్న మరమ్మతులకు కూడా ప్రైవేటు ఆపరేటర్లను ఆశ్రయించాల్సి రావడంతో చేతి చమురు వదులుతోంది. ఈ ఏడాదైనా భర్తీ జరిగేనా...? జేఎల్ఎం పోస్టుల భర్తీకి 2012 సంవత్సరంలో నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ ఇప్పటికీ నియామకాలు మాత్రం చేపట్టలేదు. ప్రభుత్వం ప్రకటించిన అస్పష్ట మార్గదర్శకాలను వ్యతిరేకిస్తూ కొంతమంది హైకోర్టునాశ్రయించారు. దీంతో పోస్టుల భర్తీ ప్రక్రియ కేవలం దరఖాస్తుల స్వీకరణకే పరిమితమైంది. దీంతో ఈ ఏడాదైనా కోర్టులో సమస్య పరిష్కారమై జేఎల్ఎం పోస్టుల భర్తీ జరుగుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.