జూనియర్ లైన్‌మెన్ నియామకమెప్పుడో..?
Published Sun, Jan 12 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
విజయనగరం విద్యుత్ విభాగం, న్యూస్‌లైన్ : ధనార్జనే ధ్యేయంగా సర్ధుబాటు చార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల జేబుల గుళ్ల చేస్తున్న సర్కారు వారికి అందించే సేవల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రధానంగా క్షేత్ర స్థాయిలో చిన్నపాటి సమస్యలను పరిష్కరించడానికి కూడా సిబ్బంది లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నా రు. ప్రైవేటు వ్యక్తులతో మరమ్మతులు చేయిం చుకుని చేతి చమురు వదిలించుకుంటున్నారు.
భర్తీకాని జూనియర్ లైన్‌మన్ పోస్టులు
ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో జూనియర్ లైన్‌మెన్‌ల కొరత ఎక్కువగా ఉంది. క్షేత్ర స్థాయిలో వినియోగదారులకు సేవలందించాల్సిన ఉద్యోగాల నియామకాలపై ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి సబ్‌స్టేషన్‌ల ప్రాంతాల వారీగా ఉండే లైన్‌మెన్‌ల పరిధిలో పని చేసే జూనియర్ లైన్‌మెన్ ఆ ప్రాంతంలో ఏ వినియోగదారునికి సమస్య వచ్చినా పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రధానంగా ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు, ఇళ్లల్లో మీటర్లకు ఫ్యూజులు వేయడం, తదితర పనులు చేస్తుంటారు. ఇంతటి క్రియాశీలకమైన జేఎల్‌ఎం పోస్టులను 1995 తర్వాత ఇంతవరకు నియమించలేదని విద్యుత్ శాఖాధికారులే చెబుతున్నారు. దీంతో సిబ్బం ది లేమి స్పష్టంగా కనిపిస్తోంది. విద్యుత్‌శాఖ నిబంధనల ప్రకా రం ప్రతి 800 విద్యుత్ సర్వీసులకు ఒక జేఎల్‌ఎంను నియమించాల్సి ఉంటుంది. 1995 సంవత్సరంలో అప్పటిసర్వీసు లకు అనుగుణంగా జిల్లా వ్యా ప్తంగా 300 మంది జేఎల్‌ఎంలను నియమిం చారు.
కాలక్రమంలో పలువురు జేఎల్‌ఎంలు ఉద్యోగవిరమణ పొంద గా... మరికొందరు పదోన్నతులు పొందారు. ప్రస్తుతం అధికారిక లెక్క ల ప్రకారం జిల్లాలో 136 మంది జేఎల్‌ఎంలు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇన్ని సంవత్సరాల కాలవ్యవధిలో విద్యుత్ సర్వీసుల సంఖ్య గణనీయంగా పెరి గింది. విద్యుత్‌శాఖ విజయనగరం, బొబ్బిలి ప్రాంతాలకు చెందిన డీఈలు అందించిన సమాచారం మేరకు రెండు ప్రాంతాల్లో కలిపి నాలుగు లక్షల 46 వేల విద్యుత్ సర్వీసులున్నాయి. పెరిగిన సర్వీస్‌ల సంఖ్యను పరిశీలిస్తే నిబంధనల ప్రకారం ప్రతి 800 సర్వీసులకు ఒక జేఎల్‌ఎం చొప్పున మొత్తం 580 మంది ఉండాలి. అయితే ప్రస్తుతం 136 మంది మాత్రమే అరకొర సేవలందిస్తున్నారు. సిబ్బంది లేకపోవడంతో విని యోగదారుల జేబులు గుళ్లవుతున్నాయి. చిన్న,చిన్న మరమ్మతులకు కూడా ప్రైవేటు ఆపరేటర్లను ఆశ్రయించాల్సి రావడంతో చేతి చమురు వదులుతోంది.
ఈ ఏడాదైనా భర్తీ జరిగేనా...?
జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి 2012 సంవత్సరంలో నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ ఇప్పటికీ నియామకాలు మాత్రం చేపట్టలేదు. ప్రభుత్వం ప్రకటించిన అస్పష్ట మార్గదర్శకాలను వ్యతిరేకిస్తూ కొంతమంది హైకోర్టునాశ్రయించారు. దీంతో పోస్టుల భర్తీ ప్రక్రియ కేవలం దరఖాస్తుల స్వీకరణకే పరిమితమైంది. దీంతో ఈ ఏడాదైనా కోర్టులో సమస్య పరిష్కారమై జేఎల్‌ఎం పోస్టుల భర్తీ జరుగుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement