APEPDCL Junion Lineman Recruitment 2021: Notification, Apply Online, Vacancies, Fee Details - Sakshi
Sakshi News home page

జాబ్‌ నోటిఫికేషన్‌: ఏపీలో లైన్‌మెన్‌ కొలువులు

Published Thu, Apr 22 2021 1:44 PM | Last Updated on Thu, Apr 22 2021 2:12 PM

APEPDCL Junior Lineman Posts Recruitment 2021: Notification, Vacancies, Salary Details   - Sakshi

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీసీపీడీసీఎల్‌).. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా గ్రామ/వార్డు సెక్రటేరియట్స్‌లో ఉన్న 86 ఎనర్జీ అసిస్టెంట్‌(జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌–2) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. రాత పరీక్ష, పోల్‌ క్లైబింగ్, మీటర్‌ రీడింగ్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు మే 3వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

అర్హతలు 
జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌–2 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. పదోతరగతితోపాటు ఎలక్ట్రికల్‌/వైర్‌మెన్‌ ట్రేడ్‌ల్లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్‌ వొకేషనల్‌(ఎలక్ట్రికల్‌ డొమెస్టిక్‌ అప్లియెన్సెస్‌ అండ్‌ రివైండింగ్‌ /ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ అండ్‌ కాంట్రాక్టింగ్‌/ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ అండ్‌ సర్వీసింగ్‌)లో ఉత్తీర్ణత సాధించాలి. 

వయసు: 31.01.2021 నాటికి 18–35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 


ఎంపిక విధానం
► ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్‌ టెస్ట్‌(పోల్‌/టవర్‌ క్లైబింగ్‌ టెస్ట్‌), మీటర్‌ రీడింగ్‌ టెస్టుల ద్వారా ఎంపిక ఉంటుంది.

రాత పరీక్ష
► పరీక్ష మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఐటీఐలో సంబంధిత ట్రేడ్‌ నుంచి ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షల్లో జనరల్‌ అభ్యర్థులు కనీసం 40శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు కనీసం 35శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు సాధించాలి. 


పోల్‌ క్లైబింగ్‌
► పోల్‌ క్లైబింగ్  టెస్ట్‌లో భాగంగా.. 15 నిమిషాల వ్యవధిలో పోల్‌ ఎక్కి దిగాల్సి ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించి.. పోల్‌ క్లైబింగ్‌లో విఫలమైతే ఈ పోస్టులకు అనర్హులుగా ప్రకటిస్తారు. 

మీటర్‌ రీడింగ్‌
► రాత పరీక్షతోపాటు పోల్‌క్లైబింగ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో మీటర్‌ రీడింగ్‌ పరీక్షలకు పిలుస్తారు. 

ఎంపిక తర్వాత
► ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు నెలకు రూ.15000 చొప్పున వేతనంగా అందిస్తారు. వీరు గ్రామ పంచాయతీ/వార్డులలో ఏర్పాటు చేసిన సెక్రటేరియట్స్‌/వార్డు సెక్రటేరియట్స్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. 


దరఖాస్తు ఫీజు
► ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.700, అలాగే ఎస్సీ/ఎస్టీ వారు రూ.350 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి: 03.05.2021
► వెబ్‌సైట్‌: www.apcpdcl.in

టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌: జూనియర్‌ అసిస్టెంట్‌ కొలువులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement