వికారాబాద్, న్యూస్‌లైన్: పట్టణంలోని ఆలంపల్లి వార్డుకు చెందిన లక్ష్మమ్మ పదహారు సంవత్సరాల కిందట నెలకు రూ.150 జీతానికి స్థానిక జిల్లా గ్రంథాలయంలో దినసరి కూలీగా చేరింది. ఇప్పుడు ఆమె వయస్సు 54 సంవత్సరాలు.ఆమెకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. ప్రస్తుతం ఆమెకు నెలకు వచ్చే వేతనం రూ.2,080 మాత్రమే. వికారాబాద్‌కు చెందిన యాదయ్య టెన్త్ వరకు చదువుకుని పది సంవత్సరాల కిందట (2002లో) దినసరి కూలీగా జిల్లా గ్రంథాలయంలో చేరాడు.అప్పట్లో చుట్టుపక్కల వాళ్లు భవిష్యత్‌లో పర్మినెంట్ అవుతుందని పేర్కొనడంతో అతడు సంతోషపడ్డారు. కానీ నేడు పరిస్థితి దానికి భిన్నంగా ఉంది.నెలకు వచ్చే రూ.2,080 తో తన ఇద్దరి పిల్లలను చదివిస్తున్నాడు. వీరి ఇద్దరి పరిస్థితే కాదు జిల్లా వ్యాప్తంగా ఏళ్ల తరబడి 65 మంది కార్మికులు పనిచేస్తున్నారు. తమ ఉద్యోగాలు ఏ నాటికైనా ప్రభుత్వం కనికరించి క్రమబద్ధీకరింకపోతుందా అనే ఆశతో వారు కాలం వెల్లదీస్తున్నారు. తాము సంవత్సరాల తరబడి వెట్టిచాకిరి చేస్తున్నా ఇటు ప్రభుత్వ యం త్రాంగం అటు పాలకపక్షం పట్టించుకోవడం లేదని పార్ట్‌టైమ్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అవుట్ సోర్సింగ్ ద్వారా ..
మూడు సంవత్సరాల కిందట గ్రంథాలయాల్లో అవుట్ సోర్సింగ్ ద్వారా వివిధ క్యాటగిరిలో ఉద్యోగులను తీసుకున్నారు.హెల్పర్ మొదలుకుని గ్రంథపాలకుల వర కు రూ. 6700 నుంచి రూ.9 వేల వరకు వేతనాలను ప్రభుత్వం అందచేస్తోంది. పా ర్ట్‌టైమ్ వర్కర్లుగా చేరిన వారికి 2003లో నెలకు రూ.750 వేతనం చెల్లించారు. మూడేళ్లుగా వారికి నెలకు రూ.2080 చెల్లిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు లభించే వేతనం కూడా తమకు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా మంత్రి పట్టించుకోరా?
ఈ విషయమై జిల్లా మంత్రి ప్రసాద్‌కుమార్,మాజీ మంత్రి సబితారెడ్డి సైతం మమ్ముల్ని విస్మరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం స్పందించి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తమను ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నారు. పేరుకు పార్ట్‌టైమ్ ఉద్యోగులుగా పేర్కొంటున్నా రె గ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే విధులు నిర్వహిస్తున్నా రు. ఇబ్బందులను గుర్తించి ఉద్యోగాలను క్రమబద్ధీకరించేలా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్,రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
పేరుకు పార్ట్‌టైమ్..చేసేది ఫుల్‌టైమ్
Published Fri, Oct 25 2013 12:20 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement