శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని రేషన్ డిపోల్లో ఈ పాస్ విధానం ద్వారా లబ్ధిదారులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసే ప్రక్రియ జూలై నెల నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే 242 డిపోల్లో ఈ-పాస్ విధానం ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి సరుకులను అందజేస్తున్నారు. అయితే ఈ విధానం ఇంకా పూర్తిస్థాయిలో అమలు జరగడం లేదు. వేలుముద్రలు సక్రమంగా పడకపోవడం, నెట్‌వర్క్ సమస్య, ఇతర సమస్యలు వేధించాయి. వాటిని తాత్కాలికంగా సరిచేసినా సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు.
దీంతో పూర్తిస్థాయిలో ఈ ప్రక్రియను వచ్చే నెల నుంచి అమలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం మరో 1721 ఈ-పాస్ మిషన్లు జిల్లాకు వచ్చాయి. వీటికి సంబంధించిన నెట్‌వర్క్‌ను ఏపీ ఆన్‌లైన్ ద్వారా సిద్ధం చేసి అమల్లోకి తీసుకురానున్నారు. అయితే ఈ విధానం పూర్తిగా సక్సెస్ కావాలంటే శతశాతం రేషన్ కార్డులు, అందులోని అన్ని యూనిట్లకి ఆధార్ ఆనుసంధానం కావాలి. అయితే వివిధ కారణాలతో ఇప్పటికీ ఆధార్ అనుసంధానం కొన్నిప్రాంతాల్లో శత శాతం జరగలేదు. జిలాల్లో 1961 రేషన్ డిపోలు ఉండగా, వచ్చేనెల నుంచి అన్ని డిపోల్లోనూ ఈ పాస్ మిషన్లు అమలులోకి రానున్నాయి.
4,36,052 యూనిట్లు గల్లంతు!
జిల్లాలోని రేషన్‌కార్డులకు సంబంధించి 4,36,052 యూనిట్లు గల్లంతాయ్యాయి. వివిధ కారణాలతో వీటికి సంబంధించిన రేషన్ సరుకులు విడుదలయ్యే పరిస్థితి లేదు. ఈ-పాస్ విధానంలో వీరంతా ఈ ప్రయోజనాన్ని సష్టపోతున్నారు. జిల్లాలో 7,81,448 కార్డులు ఉండగా, వీటిలో 26,99,613 యూనిట్లు ఉన్నాయి. వీటిలో 22,92,803 యూనిట్లకి ఆధార్ అనుసంధానం చేశారు. అన్ సీడెడ్ యూనిట్లు 21,950 ఉండగా, ఆధార్ నిర్థారణ లేక 53,000 యూనిట్లు పెండింగ్‌లో ఉండగా, పూర్తిగా తిరస్కరించిన యూనిట్లు 3,62,102 ఉన్నాయి. వీరికి రేషన్ విడుదల అయ్యే అవకాశం లేదు,
96 శాతం ఆధార్ అనుసంధానం
జిల్లా వ్యాప్తంగా సగటునా 96.79 శాతం మాత్రమే ఆధార్ అనుసంధానం జరిగింది. సారవకోట, ఎల్‌ఎన్‌పేట, పొందూరు, హిరమండలం, సరుబుజ్జిలిలో 94 శాతం అనుసంధానం జరగ్గా, పాలకొండలో 93 శాతం ఉంది.
జూలై నుంచి ఈ-పాస్ విధానం !
Published Fri, Jun 12 2015 11:28 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement