తిరుమల : తిరుమల శ్రీవారిని శుక్రవారం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ వి అఫ్జల్ పుర్కర్ దర్శించుకున్నారు. ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలసి జస్టిస్ నైవేద్య విరామ సమయం అనంతరం ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకున్నారు.
హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో ఆయనకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట జిల్లా జడ్జి ఆనంద్, అదనపు జిల్లా జడ్జి నాగార్జున, ప్రొటోకాల్ జడ్జి శేషాద్రి ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం జస్టిస్ అఫ్జల్‌పుర్కర్ కుటుంబసభ్యులతో కలిసి తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుర్కర్
Published Sat, Feb 13 2016 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 5:31 PM
Advertisement
Advertisement