'కాపుల బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాలి' | kapu community leaders meet botsa satyanarayana | Sakshi
Sakshi News home page

'కాపుల బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాలి'

Published Mon, Jan 6 2014 5:59 PM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM

kapu community leaders meet botsa satyanarayana

హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చే అంశంపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాలని కాపు సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కాపు సంఘం నేతలు కలిశారు. 2004 కాంగ్రెస్ మేనిఫెస్టోలో కాపులను బీసీల్లో చేర్చుతామని హామి ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాపులకు బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాలని.. లేకుంటే వచ్చే ఎన్నికల్లో కాపు వర్గాలన్నీ కాంగ్రెస్ కు దూరమవుతాయన్నారు.

 

ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయిన విషయాన్ని బొత్స కూడా అంగీకరించారు. అందుకు కాపు సంఘం నేతలకు బొత్స క్షమాపణలు తెలిపారు.ఈ నెల 10 లోగా సీఎం, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని హామి ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement