
'ప్రభుత్వం మాట తప్పితే పతనమే'
అనంతపురం: కాపులను బీసీ జాబితాలో చేరుస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండేళ్లయినా పట్టనట్టుండడం దారుణమని కాపు నాయకులు విమర్శించారు.
కాపుల పట్ల ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆదివారం బలిజ సంఘాలు నిరసన కార్యక్రమం నిర్వహించాయి. కంచంపై గరిటెలతో కొడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం మాట తప్పితే పతనం తప్పదని హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కాపు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కాపులకు రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.