హైదరాబాద్: పార్టీ ముఖ్య నేతలతో టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సమావేశమయ్యారు. మెదక్ జిల్లాలోని ఫామ్ హౌస్లో జరుగుతున్న ఈ సామావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, ముఖ్యనాయకుల్ని కూడా ఆహ్వానించారు. పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, ఎంపి మందా జగన్నాథం, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు.
పార్లమెంట్ సమావేశాలు చివరి దశకు వస్తుండటం, ఇప్పటి వరకు తెలంగాణ బిల్లు ప్రస్తావన లేకపోవడం, భవిష్యత్‌లో అనుసరించవలసిన వ్యూహం, పార్టీ విలీన అంశం ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. పార్టీ ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశమవడం ఈ వారంలో ఇది రెండోసారి.
పార్టీ ముఖ్య నేతలతో కెసిఆర్ సమావేశం
Published Sun, Aug 18 2013 6:28 PM | Last Updated on Wed, Aug 15 2018 8:57 PM
Advertisement
Advertisement