నమోదు చేసుకున్నా అందని ‘ఆధార్’ కార్డులు | Lakhs of people waiting for Aadhar Cards in Nizamabad district | Sakshi
Sakshi News home page

నమోదు చేసుకున్నా అందని ‘ఆధార్’ కార్డులు

Published Thu, Aug 8 2013 4:25 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM

Lakhs of people waiting for Aadhar Cards in Nizamabad district

కలెక్టరేట్,న్యుస్‌లైన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆధార్’ నమోదు నిజామాబాద్ నగరంలో అభాసు పాలవుతోంది. ప్రజల నుంచి స్పందన భాగానే ఉన్నా... కార్డులు జారీ కాకపోవడంతో ఆవేదనకు గురవుతున్నారు. ఆధార్ నమోదు గత ఏడాది ఆగస్టులో ప్రారంభమైంది. నగరం లో సుమారు 3.83 లక్షల జనాభా ఉండగా ఇప్పటి వరకు 3,57,373 మంది ఆధార్  కోసం నమోదు చేసుకున్నారు.సెప్టెంబర్ చివరికల్లా ఆధార్ నమోదు 100 శాతం పూర్తిచేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ ఆదేశించారు.
 
 అయితే కథంతా ఇక్కడే మొదలైంది.. ఆధార్ నమోదు తప్ప కార్డుల సంగతి ఇటు అధికారులు, అటు ఏజెన్సీ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. కేవలం నమోదుపైనే దృష్టి పెట్టడంతో కార్డుల పంపిణీ వెనుకబడిపోయింది. నగరంలో సుమారు లక్ష మంది వరకు  ఆధార్‌ను నమోదు చేసుకుని కా ర్డుల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోం ది. వీరు తిరిగి ఆధార్ కార్డు కోసం ‘మీ సేవ’లేదా ఇంటర్ నెట్‌ల చుట్టూ పరుగులు పెటా ్టల్సి వస్తోంది. ప్రస్తుతం అన్నింటికీ ఆధార్ కార్డు అవసరమవుతున్నందున నెట్ నిర్వాహకులు ఇదే అవకాశంగా అందిన కాడికి దండుకుంటున్నారు. ఒక్కో కార్డుకు రూ. 50 నుంచి రూ.70 వసూలు చేస్తున్నారు.
 
 ఆధార్ నమోదు చేసుకున్న నెలన్నరకు కార్డు అందాల్సి ఉంది. అయి తే నమోదు సమయంలో దొర్లుతున్న పొరపాట్లతో  కార్డు తిరస్కరణకు గురవుతున్న ట్లు తెలుస్తోంది. ఏజెన్సీ నిర్వాహకులు కూడా ఏదో నమోదు చేశామా... అన్న చందంగా ప్రక్రియను సాగించడం వలన నగరంలో కార్డులు జారీ కాలేకపోతున్నాయని విమర్శలు వస్తున్నా యి. ఒక్కో ఆధార్ నమోదుకు ఏజెన్సీకి రూ.12 చొప్పున కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. నమోదు నుంచి కార్డు జారీ చేసేవరకు ఏజెన్సీదే బాధ్యత.అయితే ఇది అమలుకు నోచుకోవడం లేదు. కార్డుల జారీలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. పోస్టాఫీసుల్లో కార్డులు ఆగిపోతున్నాయని కూడా అంటున్నారు. నగరంలో ఆధార్‌నమోదు ఎన్‌రోల్‌మెంట్‌ను శ్రీవేణి ఇన్‌ఫో కం పెనీ లిమిటెడ్ చేపట్టింది. ప్రస్తుతం ఏడు కేం ద్రాల ద్వారా ఆధార్ నమోదు జరుగుతోంది. ప్రతి రోజు ఒక్కో కేం ద్రంలో 50 మంది వరకు ఆధార్  కార్డు కోసం నమోదు చేయించుకుంటున్నారు.
 
 ఏడాది అయ్యింది
 ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకొని ఏడాది అయింది. ఇప్పటికీ రాలేదు. ప్రతి రోజు ఇంటికి వెళ్లగానే అమ్మను కార్డు కోసం అడుగుతున్నా... పోస్టుమన్‌ను ఆరా తీస్తున్నా.. అతను వస్తే ఇస్తాంగా అంటున్నాడు. నెట్‌లో తీసుకొందామనుకుంటే *50 అడుగుతున్నారు.
 -వెంకటి.నాందేవ్‌వాడ
 
 చిరునామాలతో సమస్య
 ఆధార్ నమోదు జిల్లాలో వేగవంతం అయినా కార్డు జారీలో ఆలస్యమైన మాట నిజమే. అయితే నమోదు జరిగిన అధార్ కార్డులు బెంగళూర్ ప్రధాన కార్యాలయం నుంచి రావాల్సి ఉంటుంది. కార్డులు జారీ అవుతున్నాయని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. మరికొందరి చిరునామాలు తప్పుగా ఉంటున్నాయి.  
 - ఉద య్‌కుమార్,ఏఎస్‌ఓ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement