విశాఖ భూస్కామ్‌పై 22న మహాధర్నా | Mahadarna on 22nd of this month on vishaka land scam | Sakshi
Sakshi News home page

విశాఖ భూస్కామ్‌పై 22న మహాధర్నా

Published Sun, Jun 18 2017 2:48 AM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

విశాఖ భూస్కామ్‌పై 22న మహాధర్నా

విశాఖ భూస్కామ్‌పై 22న మహాధర్నా

- పాల్గొననున్న వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌
- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడి
 
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో వెలుగు చూసిన భూ కుంభకోణంపై ఈ నెల 22న విశాఖ కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా చేపడుతున్నట్టు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడించారు. భూ బాధితులకు అండగా నిలిచేందుకు ఈ మహాధర్నాలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారని ఆయన ప్రకటించారు. విశాఖలో  జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

భూ కుంభకోణంపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇటీవల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అఖిలపక్షం తీసుకున్న నిర్ణయం మేరకు ఆందోళనను ఉధృతం చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మహాధర్నా తలపెట్టామని,  ఇప్పటికే వామపక్షాలు, లోక్‌సత్తాతో పాటు వివిధ ప్రజా సంఘాలు, మేధావులు మద్దతు పలికారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement