టోల్‌గేట్, (కొవ్వూరు) : కొవ్వూరు గోష్పాద క్షేత్రం సమీపంలో పిండ ప్రదానాలు చేస్తున్న పురోహితులు, భక్తుల కష్టాలను అధికారులు తీర్చారు. ఇక్కడ పిండప్రదానాలకు తగినన్ని షెడ్లు ఏర్పాటు చేయకపోవడంతో పిండ ప్రదానాలకు భక్తులతో పాటు పురోహితులు ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా ఎండలోనే పురోహితులు పిండప్రదానాలు జరిపించాల్సి వచ్చేది. దాదాపు వెయ్యిమంది పురోహితులు ఆరు బయట కటికి ఎండలో నేలపై కూర్చుని పిండప్రదానాలు నిర్వహిస్తున్నారు. పురోహితుల కష్టాలపై ‘ఎండలో పిండ ప్రదానాలు’ శీర్షికన గురువారం ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. షెడ్లకు సమీపంలో ప్రత్యేకంగా షామియానాలు ఏర్పాటు చేసి పిండప్రదానాలు నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో పురోహితులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా షామియూనాల నీడలో పిండప్రదానాలు చేశారు.
పిండ ప్రదాన కష్టాలకు చెక్
Published Fri, Jul 17 2015 1:46 AM | Last Updated on Tue, Aug 28 2018 4:00 PM
Advertisement