
ఆంధ్రప్రదేశ్ :
► ఏపీలో 534కు చేరిన కరోనా కేసులు. ఇప్పటివరకు కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 14కు చేరగా, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20కి చేరింది.
► లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దారిద్ర్యరేఖకు దిగువనున్న(బీపీఎల్) కుటుంబాలకు ఆర్థిక సాయం నిమిత్తం ప్రభుత్వం మరో రూ. 43.28 కోట్లు విడుదల చేసింది.
తెలంగాణ :
► తెలంగాణలో 700కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 186 మంది డిశ్చార్జ్ కాగా, 18 మంది మృతిచెందారు.
జాతీయం :
► దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,759కి చేరింది.
► ఇప్పటివరకు 1,515 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. 420 మంది కరోనాతో మృతిచెందారు.
► నేడు ఉదయం 10 గంటలకు ఆర్‌బీఐ గవర్నర్ మీడియాతో మాట్లాడనున్నారు.
ప్రపంచం :
► ప్రపంచ వ్యాప్తంగా 21.82 లక్షలు దాటిన కరోనా కేసులు
► ఇప్పటివరకు కరోనా నుంచి 5.47 లక్షల మంది కోలుకున్నారు. 1.45 లక్షల మంది కరోనాతో మృతి చెందారు.
► కరోనా వ్యాప్తి దృష్ట్యా బ్రిటన్‌లో మరో 3 వారాలు లాక్‌డౌన్ పొడిగించాలని నిర్ణయం
► న్యూయార్క్‌లో మే 15 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
► దక్షిణ కొరియాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ విజయ దుందుభి మోగించింది. మొత్తం 300 స్థానాలున్న జాతీయ అసెంబ్లీలో మూన్ నేతృత్వంలోని లెఫ్ట్ పార్టీల కూటమికి 180 సీట్లు వస్తే, ప్రతిపక్ష కన్జర్వేటివ్ యునైటెడ్ కూటమి 103 స్థానాలు దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment